చక చకా..

Fri,June 14, 2019 03:25 AM

-కలెక్టర్ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం
-మండలానికి 18 మంది తాసిల్దార్ల కేటాయింపు
-గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం వేగవంతం
గండీడ్ : భూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. గత ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారం చకచకా సాగుతోంది. భూరికార్డుల ప్రక్షాళన గడువు ముగిసినప్పటికీ కొందరు అధికారుల నిర్ల క్ష్యం కారణంగా జిల్లాలోనే గండీడ్ మండలంలో అనేక భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఆయా సమస్యలను పరిష్కరించి భూ పట్టాదారులకు నూతన పాస్ పు స్తకాలు అందజేయడంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై జి ల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా వీఆర్వో స్థాయి నుంచి తాసిల్దార్ వరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పే రుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మండలంలోని అనేకమంది అధికారులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలకు రైతులు దూరమయ్యారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవె న్యూ అధికారులను ఒక్కో గ్రామానికి ఒకరిని కేటాయించిన ఫలితం లేకపోయింది.

18మంది తాసిల్దార్ల కేటాయింపు
మండలంలో భూ సమస్యల పరిష్కారం పై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి సారించారు. భూరికార్డుల ప్రక్షాళనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల అధికారులు, సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపా టు, సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని 18మంది తాసిల్దార్లను మండలానికి కేటాయించారు. రెండు గ్రామాలకు ఒక తాసిల్దా ర్, ఎక్కువ సమస్యలు ఉన్న గ్రామానికి ఒక తాసిల్దార్ చొప్పున నియమించారు. దీంతో గత మూడు రోజులుగా గ్రామాల్లో తాసిల్దార్లు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నా రు. కలెక్టర్ ఆదేశాలతో ఆయా గ్రామాలకు వచ్చిన అధికారులు తమతమ కార్యాలయాల నుంచి నిష్ణాతులైన సిబ్బందిని తమ వెంట తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తూ పట్టాదారు పాసు పుస్తకాల్లో నిజమైన పట్టాదారులను నమోదు చేస్తున్నారు. దీంతో మండల కార్యాలయంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పైళ్లన్నీ వేగంగా కదులుతున్నాయి. మండలంలో వందశాతం భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లోనే తాసిల్దార్లు..
భూ సమస్యల పరిష్కారం కోసం గ్రా మాలకు కేటాయించిన తాసిల్దార్లు స్థానికం గా ఉండి భూ సమస్యలను పరిష్కరిస్తున్నా రు. అడ్డాకుల తాసిల్దార్ రవీంద్రనాథ్‌ను చిన్నవార్వాల్ , నంచర్ల గ్రామాలకు నియమించగా, బాల్‌నగర్ తాసిల్దార్ వెంకటేశ్వర్లును జిన్నారం, చెల్మిల్లా, చిన్నచింతకుంట తాసిల్దార్ ఆర్.రాజును పగిడియాల్, సంగాయపల్లి, భూత్పూర్ తాసిల్దార్ మహేందర్‌రెడ్డిని వెన్నాచేడ్, లింగాయపల్లి, దేవరకద్ర తాసిల్దార్ కృష్ణయ్యను సల్కర్‌పేట్, కప్లాపూర్, గండీడ్ తాసిల్దార్ కిషన్‌ను వరహగిరిపల్లి, మన్సూర్‌పల్లి, హన్వాడ తాసిల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని కొంరెడ్డిపల్లి, జడ్చర్ల తాసిల్దార్ వై.శ్రీనివాస్‌రెడ్డిని గండీడ్, బైస్‌పల్లి, కొయిల్‌కొండ తాసిల్దార్ షాయిదా బేగంను పెద్దవార్వాల్, మహబూబ్‌నగర్ అర్బన్ తా సిల్దార్ వెంకటేశంను రెడ్డిపల్లి, మహబూబ్‌నగర్ రూరల్ తాసిల్దార్ రాజేందర్‌రెడ్డిని మ హ్మదాబాద్, బల్సుర్‌కొండ, మిడ్జిల్ తాసిల్దార్ రాంచంద్రయ్యను చౌదర్‌పల్లి, మూ సాపేట తాసిల్దార్ పుష్పలతను మంగంపే ట, గోవింద్‌పల్లి, నవాబ్‌పేట తాసిల్దార్ ఆర్.రాజును సాలార్‌నగర్, రాజాపూర్ తా సిల్దార్‌ను నర్సింగ్‌రావును మొకర్లాబాద్, గాధిర్యాల్, కలెక్టర్ సీ సెక్షన్ తాసిల్దార్ బాల్‌చందర్‌రావును రుసుంపల్లి, కొండాపూర్, కలెక్టరేట్ డీ సెక్షన్ తాసిల్దార్ పుష్పలతను అ న్నారెడ్డిపల్లి, ఈ సెక్షన్ తాసిల్దార్ మున్నెప్ప ను జూలపల్లి గ్రామానికి నియమించారు. ఆ యా గ్రామాల్లో అధికారులు ఉంటూ భూ సమస్యలను పూర్తిస్థాయిలో త్వరితగతిన పరిష్కరించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles