పీహెచ్‌సీని పరిశీలించిన కేంద్ర బృందం

Thu,June 13, 2019 01:23 AM

-నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం
మానవపాడు: కాయకల్ప ఎంపికకోసం కేంద్ర బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. బుధవారం మండలంలోని పీహెచ్‌సీని డాక్టర్ అలోక్ రంజన్, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ అధికారి విటల్ సందర్శించారు. అనంతరం పీహెచ్‌సీని పరిశీలించారు. మొదటగా ల్యాబ్‌ను పరిశీలించి, ల్యాబ్‌లో ఏఎ పరీక్షలు చేస్తారు రోజుకు ఎంతమందికి పరీక్షలు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని ప్రసవాలు చచేస్తున్నారు, ప్రసవాలు మెథడ్ ప్రకారం చేస్తున్నారా? లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూంలో ప్రసవాలకు అవసరమైన సదుపాయాలు ఉన్నా యా లేదా అని పరిశీలించా రు. అలాగే ఆరోగ్యకేం ద్రం లో ఉన్న మందుల గదిని పరిశీలించారు. మందుల సరఫ రా, నిల్వ ఉంచిన తీరును పరిశీలించారు. అనంతరం డాక్ట ర్ దివ్యను ప్రసవాల మె థడ్, సబ్‌సెంటర్ల విధుల గు రించి, పీహెచ్‌సీ పనితీ రు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రబృందం సభ్యులు మాట్లాడుతూ పీహెచ్‌సీలో కార్పొరేట్ దవాఖానలో ఉన్నట్టుగా అన్నిరకాల సౌకర్యా లు, వసతులు సిబ్బంది పనితీరు బాగుందన్నారు. దవాఖానాకు మొదట వచ్చినప్పు డు సేవలు అందించినట్లు చివరివరకు సేవలు అందించాలని సూచించారు. దవాఖాన మీది దీన్ని అందరూ కలసిమెలసి ప నిచేసి రోగులకు ఉత్తమ సేవలు అందించి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. దవాఖానాలో రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ సేవాభావంతో పనిచేసి పీహెచ్‌సీకి మంచిపేరు తేవాలని కేంద్రబృందం సభ్యులు విటల్, అలోక్ రంజన్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షాద్, స్టాఫ్‌నర్సు రోజారాణి, చంద్రన్న, నర్సయ్య, సత్యనారాయణ, నాగమ్మ, కాయకల్ప కో- ఆర్డినేటర్‌లు వంశీ, దివాకర్, ఆశావర్కర్లు ఏఎన్‌ఎంలు, 102 సిబ్బంది, వెంకటేశ్వరాచారి, సిబ్బంది పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles