ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Thu,June 13, 2019 01:23 AM

-పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి హృదయరాజు
గద్వాల న్యూటౌన్ : ఈ నెల 7న ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట రీ పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 10 పరీక్షాకేంద్రాల్లో జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలకు 158 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షకు 1,308 హాజరుకావాల్సి ఉండగా 1,192 మంది విద్యార్థులు హాజరయ్యారని, 116 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి హృదయరాజు పేర్కొన్నారు. అదేవిధంగా సెకండియర్ పరీక్షలకు 389 మంది విద్యార్థులకు గాను 347 మంది హాజరవగా 42 మంది విద్యార్థులు హాజరుకాలేదన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొట్టం మాణిక్యమ్మ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను నోడల్ అధికారి హృదయరాజు పరిశీలించి పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు సహకరించిన సీఎస్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లకు హృదయరాజు కృతజ్ఞతలు తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles