నకిలీ మకిలీపై కొరడా

Thu,June 13, 2019 01:22 AM

-జిల్లాలో విచ్చలవిడిగా నాసిరకం పత్తివిత్తనాలు
-భారీగా సీజ్ చేస్తున్నఅధికారులు
-రాష్ట్ర సరిహద్దు మండలాల్లో ఎక్కువగా పట్టివేత
-విత్తన నియమావళి చట్టంకింద కేసులు నమోదు
-అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే వాడాలని అవగాహనలు
జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల తీ వ్రంగా నష్టపోయేందుకు కారణమైన నకిలీ విత్తన మాఫీయాపై ప్రభుత్వం ఉక్కుపాద మోపుతుంది. జిల్లాలో ఎక్కడా కూడా నకిలీ పత్తివిత్తనాలు చలామణీకాకుండా తగిన చ ర్యలు చేపడుతున్నారు. అనుమతులు లేని నకిలీ, లూజు, కలుపుమందులను తట్టుకొనే పత్తి విత్తనాలను అరికట్టేందుకు జిల్లా పోలీ సు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయాధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సరిహద్దు జి ల్లాలు, రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నయన్న పక్కా సమాచారంతో ఈ వరుస దాడులు చేస్తున్నారు. అమయకమైన రైతులకు వీటిని కొనుగోళు చేసి నష్టపోకుండా నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. లూజూ, నకిలీ విత్తనాలు విక్రయించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

10 రోజుల్లో 27 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలు పట్టివేత
జిల్లాలోని టాస్క్‌ఫోర్స్, పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు పక్కా సమాచారంతో మెరుపుదాడులు చేపట్టి నకిలీ విత్తనాలను కట్టడి చేస్తున్నారు. నకిలీ విత్తనాలను పూర్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామానా రెక్కీ నిర్వహించి చర్యలు చేపడుతున్నారు. గత 10 రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు చోట్ల దాడులు చేపట్టి 27 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. మే 31న గట్టు మండలం లింగనవాయి గ్రామంలో 6 మం ది రైతుల ఇళ్లలో సోదాలు నిర్వహించి 8 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. వీటితో పాటు రంగు ప్యాకెట్లు, తూకం మిష న్, కంపెనీ లేబుల్ ముద్రించంబడిన ఖాళీ ప్యాకెట్లు సీజ్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 6 మంది రైతులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. అదే రోజు ధరూర్ మం డలంలోని మార్లబీ డు గ్రామంలో కూడా నకిలీ పత్తివిత్తనాలను అధికారులు పట్టుకున్నారు. గ్రామంలోని బి.వెంకటేశ్ అనే వ్యాపారి ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వున్నాయన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దా డుల్లో 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. అయిజ మండలం పులికల్ గ్రామం శివారులో జూన్ 4న 3క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలను పట్టకున్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన రాజు దగ్గర నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఆటోలో 5 సంచుల్లో ఈ విత్తనాలను రవాణా చేస్తుండగా పులికల్ గ్రామానికి సమీపంలో అధికారులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఈ విత్తనాలు పట్టుబడ్డాయి. ఇక అత్యధికంగా 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనలు జూన్ 11న గట్టు మండలం పట్టుబడ్డాయి. మండంలోని మాచెర్ల గ్రామంలోని రామపురం వెంకటేశ్ ఇంట్లో నిల్వచేసిన 20 గోనసంచుల్లో ఉన్న ఈ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు.

అమాయక రైతులే లక్ష్యంగా..
గ్రామాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు, దళారులు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నా రు. మారుమూల మండలాల్లో, గ్రామాల్లో రైతులను లక్ష్యంగా చేసుకొని దందా కొనసాగి స్తున్నారు. తాము అందించే విత్తనాలు మార్కెట్ ధర కంటే తక్కువకు వస్తా యని ఈ విత్తనాలను సాగుచేస్తే కలుపు తీయకుండా నే రౌండప్ మందు స్ప్రే చేసి పత్తి పంటకు ఎలాంటి నష్టం లేకుండా గడ్డిని చంపేయవచ్చని మాయమాటలు చెబుతున్నారు. వివిధ కంపెనీల పేర్లతో ముద్రించిన ప్యాకెట్లలో ఈ విత్తనాలను తీసుకువచ్చిన రైతులకు అంటగడుతున్నారు. వీటిని కొన్న రైతులు పంట సరిగా చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టంపోతున్నారు.

చట్టపరమైన చర్యలు తప్పవు..
నకిలీ, అనుమతి లేని విత్తనాలను విక్రయించిన కొనుగోళు చేసి న చట్టపర మైన చర్యలు చేపడుతాం. ఈ విత్తనాలను రైతులు పంట పొలాల్లో సాగుచేస్తే చట్టం 1966, విత్తన నియమావళి చట్టం 1968, పర్యావరణ రక్షణ చట్టం 1989 ప్రకా రం నేరం గా చట్టంలో పొందుపరచారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నియమాలను అతిక్రమించిన వ్యక్తులపై పీడీ యాక్ట్ నమో దుచేసి కఠిన చర్యలు చేపడుతాం. ప్రభుత్వం ద్వారా అనుమతులు పొందిన విత్తనాలను లైసెన్స్‌డ్ డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోళు చేయాలి. విత్తనాలు కొనుగోళు చేసేటప్పుడు తప్పకుండా బిల్లులు అడిగి తీసుకోవాలి. జిన్నింగ్, లూజు పత్తి విత్తనానలు కొనుగోలు చేయకూడదు.
-గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి జోగుళాంబ గద్వాల

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles