భూ సర్వే సమస్యలు పరిష్కరించాలి

Thu,June 13, 2019 01:22 AM

-ఈ నెల 14లోపు పూర్తిచేయాలని తాహసిల్దార్లకు కలెక్టర్ ఆదేశం
గద్వాల, నమస్తేతెలంగాణ: జిల్లాలో భూ సర్వేకు సంబంధించిన కరెక్షన్‌లు, నోషనల్ ఖాతాల మార్కింగ్ వంటివి ఒక కొలిక్కి వచ్చినందున వాటిని ఈ నెల 14లోపు పూర్తిచేసి జీరో చేయాలని కలెక్టర్ తహసీల్దార్‌లను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఎల్‌ఆర్‌యూసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భ ంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన ఖాతాలు, ఇంకా పెండింగ్‌లో మిగిలి ఉన్న ఖాతాలపై తహసీల్దార్‌లను అడిగి తెలుసుకున్నారు. సరిదిద్దే ఖాతాలు, నోషనల్ ఖా తాలు పూర్తిచేసి మ్యూటేషన్ సక్సెస్ వం టివి పూర్తిచేసి వాటికి ఇక ముగింపు పలకాలన్నారు. ఇంకా కొన్నిఖాతాలు డి జి టల్ సంతకాలు కాలేదని దీనికి కార ణం ఏమిటని తహసీల్దార్‌లను ప్రశ్నించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌లు కలెక్టర్‌కు పలు సమస్యలు వివ రించా రు. కొన్ని సర్వే నంబర్లకు ఖాస్రా, సేత్వార్‌లో ఇనామ్ కిద్మత్‌లు అని రాసి ఉన్నాయని వాటిలో కొన్నింటిని ఓఆర్‌సీ, యాజమాన్య ధ్రువీకరణ లేవని తెలిపా రు. మరికొన్నింటికి ఆధార్ ఫింగర్ ఫ్రిం ట్‌లు, ఐరీస్‌లు నమోదు కావడం లేదని తెలిపారు.

ఇందుకు స్పందించిన కలెక్టర్ ఆయా మండలాల వారిగా మొత్తం ఎన్ని ఇనామ్ ఖాతాలు, సర్వే నంబర్లు ఉన్నాయి వాటిలో ఎన్నింటికి ఓఆర్‌సీ ఇచ్చారు ఓఆర్‌సీ లేకుండా పాస్ పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూ మిని ఎవరూ అనుభవిస్తున్నారు. అనే వివరాలతో ఒక న మూనా పట్టిక తయారు చేసి ఈనెల 24 లోగా కలెక్టరేట్‌కు పంపాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ఇనామ్ ఖాతాలకు సంబంధించిన సమస్యను ఎప్పుడో ఒకప్పుడు పరిష్కరించక తప్పదని ఈ న మూనాలో సమాచారం వచ్చిన తర్వాత ఒక వేళ ఇనామ్ భూమిని మొదట ఇనామ్ తీసుకున్న వ్యక్తి అనుభవిస్తూ ఉంటే అలాంటి వారికి ఓఆర్‌సీ ఇచ్చేప్రయత్నం చేద్దామని కలెక్టర్ తెలిపారు. అలాకాకుండా వేరే వ్యక్తికి అమ్మిఉంటే వాటి విషయంలో కేసువారిగా ఆర్డీవోకు పంపుదామని సలహా ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఎంతమందికి కేవైసీ సమస్య ఉందో అలాంటి వారిపేర్లు గ్రా మపంచాయతీలో నోట్ బోర్డుపై పెట్టాలని సూచించారు. సమగ్ర భూసర్వేలో జిల్లాలో వందశాతం సమస్యలు పరిష్కరించే విధంగా తహసీల్దార్‌లు చొరవ తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జేసీ నిరంజన్ తహసీల్దార్‌లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles