అమ్మో ఒకటో తారీఖు

Mon,May 27, 2019 03:43 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పెట్టు బడుల కాలం ముంచుకొస్తున్నది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలల్లో చేర్పించాలా? అన్న ఆలోచనలను ఆరంభించారు. మరోవైపు ప్రైవే టు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే తమ పాఠశాలల ప్రత్యేకతలకు మరిన్ని హంగులను జోడించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పాఠశాలలు గత విద్యా సంవత్స రం కన్నా ఈ సంవత్సరం మరింతగా ఫీజులను పెంచి విద్యార్థులకు ప్రవేశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఇప్పటికే వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు నాణ్యమైన అందించాలనే సంకల్పంతో పేరు ప్రఖ్యాతలున్న పాఠశాలల్లోనే చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు సైతం తల్లిదండ్రుల ఆరాటాలను సొమ్ము చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. సాధారణ పాఠశాలలు మాత్రం ఉన్న ఫీజులను య థావిధిగా కొనసాగిస్తూ పుస్తకాలు, డ్రస్సులు, తదితరాల నుంచి లాభాలను పొందేందుకు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పాఠశాలలు పునః ప్రారం భం కానుండడంతో తమ పిల్లలకు పెట్టు బడులను పెట్టేందుకు అవసరమైన డబ్బులను సమకూర్చుకునే ప్రయత్నాలలో తల్లిదండ్రులు ఉన్నారు. అవసరమైతే అప్పులు చేసైనా తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు వెనుకాడడం లేదు.

జూన్ 12న పాఠశాలల ప్రారంభం
జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలకు విద్యార్థులను పంపించేందుకుగాను తల్లిదండ్రులు ఇప్పటికే పాఠశాలలను సంప్రదించి ఆయా పాఠశాలల యూనిఫాంలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేటు పాఠశాలలోనూ ఇప్పటికే కొందరు తమ బిడ్డలను జాయిన్ చేయడం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో తమ బిడ్డలను పా ఠశాలలకు పంపించేందుకుగాను టిఫిన్ బాక్సులు, పెన్ను లు, నోట్ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి కాలానికి తల్లిదండ్రులు డబ్బులను పోగుచేసుకుంటు ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తమ బిడ్డలకు చదివించేందుకు డబ్బుల కొరత రాకూడదనే పట్టుదలతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదవిస్తే ఏ మేరకు ఖర్చులు వస్తాయో అంచనలు వేసుకుంటున్నారు. పక్కాగా ఖర్చులను లెక్కలు కట్టి తల్లిదండ్రు లు తమ బిడ్డల చదువుకు సన్నద్ధం అవుతున్నారు.

జోరుగా ప్రచారం
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే త మ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ప దో తరగతి ఫలితాలతో కొన్ని పాఠశాలలు తమ ప్రచా ర కార్యక్రమాలను నిర్వహిస్తుండగా మరికొన్ని పాఠశాలలు పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో ఉన్న ప్రత్యేకతలను చాటుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు ఆకర్షణీయమైన రంగులలో తమ ప్రత్యేకతలను చా టుతూ కరపత్రాలను రూపొందించి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులను స్వయంగా కలిసి తమదైన శైలీలో పిల్లలను పాఠశాలలకు రప్పించుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అన్ని పాఠశాలల్లోనే ..
ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు పెన్సిల్, రబ్బర్ నుంచి యూ నిఫాం వరకు ప్రతీ ది పాఠశాలల్లోనే కొనే విధంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధన మినహా మిగతా వ్యాపారాలు జరగకూడదని, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వారి వారి మార్గాల లో విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నింటినీ విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్‌లో లభించే ధరల కన్నా అధికంగా ధరలను ము ద్రించి వస్తువులు, పుస్తకాలపై అతికించి విక్రయిస్తూ లాభాలను గడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఫీజులు ఇలా..
ఈ విద్యాసంవత్సరం ఫీజుల మోత మోగించేందుకు కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరానికి 210కిపైగా గుర్తింపు పొందిన పాఠశాలలు జిల్లాలో ఉన్నాయి. వీటిలో 70 వేల మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. కాగా గతేడాదికన్నా 15 నుం చి 20 శాతానికిపైగా ఫీజులను పెంచి రానున్న విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీ విద్యార్థులకే రూ.15 నుంచి రూ.30 వేల వరకు ఫీజులను నిర్ణయించి ప్రవేశాల కోసం వస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. 5,6,7 తరగతుల విద్యార్థులకు 20 నుంచి 35 ఏళ్ల 8,9 తరగతులు విద్యార్థులకు రూ.25 నుంచి రూ.40 వేలు, 10వ తరగతి విద్యార్థులకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులను వసూలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నారు. బస్సు ఫీజులు, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, షూస్ అంటూ అదనంగా మరో రూ.10 నుం చి రూ.15 వేల వరకు వసూలు చేయనున్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles