జూన్‌లో ఓడీఎఫ్‌లోకి ..

Mon,May 27, 2019 02:19 AM

-జూన్‌లో ఓడీఎఫ్‌గా జిల్లా ..
-వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు
-జూన్ చివరినాటికి మరుగుదొడ్లు పూర్తి
-జిల్లాలో 65,787 మరుగుదొడ్ల లక్ష్యం
-54వేల మరుగుదొడ్లకు జియోట్యాగింగ్
-32,138 మరుగుదొడ్లు పూర్తి
-30వేలు నిర్మాణాలు చివరి దశలో
-బహిరంగా మల మూత్ర విసర్జన గ్రామాలుగా 30 జీపీలు

జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : బహిరంగ మలమూత్ర విసర్జన వల్లే రోగాలు రావడానికి కారణమనే విషయాన్ని అధికారులు ప్రజలకు చాటిచెబుతూ వారి భాగస్వాములను చేస్తూ వేగవంతగా మరుగుదొడ్ల నిర్మిం చుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ శశాంక దృష్టి సారించా రు. బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశ్యంతో స్వచ్చభారత్‌క మిషన్ ద్వారా నిధులను సమకూర్చి ఇంటింటా మరుగుదొ డ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే రూ.12వేలు జమచేస్తూ మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్యను పెంచుతున్నారు. 12 మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటనలు కొనసాగించి ప్రజల్లో అవగా హనలు చేపట్టారు. జిల్లాలోని పంచాయితీరాజ్, డీఆర్‌డీవో అధికారులకు టార్గెట్‌లను విధించి పనులు చేపట్టారు. ప్రతి గ్రామా న్ని ఓడీఎఫ్ జాబితాలో చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

-జిల్లాలో 65,787 మరుగుదొడ్లు
జిల్లాలో 65,787 మరగుదొడ్ల ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసు కొని అధికారులు ముందుకు సాగుతున్నారు. వీటిలో 54 వేలకు మరుగుదొడ్లకు అనుమతులు ఇచ్చి 52 వేల మరుగుదొడ్లకు జి యో ట్యాగింగ్ ను పూర్తి చేశారు. ఇప్పటి వరకు 32,138 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన దాదాపు 50శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పూ ర్తి చేసిన గ్రామాల్లో రూ. 40.77లక్షలను అధికారులు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 30 గ్రామపంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు. ఈ ఏడా ది జూన్ చివరి నాటికి పూర్తిగా మరుగుదొడ్లను నిర్మించాలనే ప్రణాళికలతో ముం దుకు సాగుతున్నారు. గ్రామాల్లోని ప్రజలందరినీ భాగస్వాములుగా చేస్తూ ఈ పనులకు ముమ్మరం చేశారు.

-నాలుగు విడతల్లో పనులు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి మరుగుదొడ్ల నిర్మాణాన్ని నెమ్మదిగా చేపట్టేవారు. ఇందుకు సంబంధించిన నిధులు సక్రమంగా లబ్ధిదారులకు అందక పోవడంతో ప్రజల్లో ఒక రకమైన నిరాశ ఏర్పడింది. దీంతో మరు గుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూసేవారు కాదు. కాని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులను చేపట్టారు. నాలుగు విడతల్లో గ్రామపంచాయతీలోని గ్రామాలను ఎంచుకొని నెల రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీలు, నరేగా సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు, విద్యార్థులను, స్వచ్చంద సంస్థలను అందరిని భాగస్వాములుగా చేసి కార్యక్రమాన్ని మందుకు తీసుకువెళ్తున్నారు. గత 6 నెలలుగా ఎన్నికల సందర్భంగా నెమ్మదిగా కొనసాగిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇప్పుడిక ఊపందుకున్నాయి. జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ప్రతి ఒక ఇంటికీ మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు.

-అవగాహన కార్యక్రమాలు
స్వచ్ఛభారత్, మరుగుదొడ్ల నిర్మాణంలో అవగాహన లోపంతో ఉన్న ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు పలురకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని, స్వచ్ఛ యాత్ర కార్యక్రమాల్ని చేపట్టారు. వీటితో పాటు జిల్లా కలెక్టర్ రోజు రెండు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న సహ కారాన్ని వివరిస్తూ బహిరంగ మలమూత్ర విసర్జన వలన కలిగే నష్టాలను వివరిస్తున్నారు. కళాజాత బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు తెలిపే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు..

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles