రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులు వీరే..

Mon,May 27, 2019 02:15 AM

నారాయణపేట నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లా లో జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యే వారి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా వనపర్తిలో జరిగే వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరవుతారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరగనున్న వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచార్యులు, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే వేడుకలకు మరో ప్రభుత్వ సలహాదారు అనురాగశర్మ హాజరవుతుండగా, గద్వాలలో జరిగే వేడుకలకు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ హాజరవుతారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకలకు హాజరయ్యే ముఖ్య అతిథులు జాతీయ పథాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే వేడుకల్లోనూ ముఖ్య అతిథులు పాల్గొంటారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles