కేసుల పరిష్కారం సత్వరమే జరగాలి

Sun,May 26, 2019 03:24 AM

-ఉమ్మడి జిల్లాలో 41 వేల కేసులు
-2014 వరకు ఉన్న కేసులను 6 నెలల్లో పరిష్కరించాలి
-కోర్టు భవనానికి 25 ఎకరాలు అవసరం
-జూనియర్లకు సీనియర్లు సహకరించాలి
-రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహాన్

మహబూబ్‌నగర్ లీగల్ : న్యాయస్థానాలను ఆశ్రయించే సామాన్యులకు నమ్మకం కలిగేలా న్యాయం జరగాలని రాష్ట్ర హైకో ర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రా ఘవేంద్ర ఎస్.చౌహాన్ అభిప్రాయపడ్డా రు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం జిల్లా ప్రధాన కోర్టును న్యాయమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ పక్షాన జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హా జరై మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యా ప్తంగా మొత్తం 41వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయ ని, వాటిని త్వరితగతిన పరిష్కారం చేసేలా చూడాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 2014 సంవత్సరం వరకున్న కేసులన్నీంటిని ఇప్పటికే పరిష్కరించగలగాలని ఆదేశాలు ఉన్నాయని, వాటి అమలు జరగాలన్నారు. ఈ కేసులను 6 నెలల్లో పరిష్కరించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.

దీనిపై హైకోర్టు పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు దృష్టి సారించారని, ఇందుకు అనుగుణంగా న్యాయవాదులు కూడా సహకరించి ఇలాంటి కేసులను వెంటనే పరిష్కరించేందుకు తోడ్పాటునందించాలన్నారు. న్యాయ వ్యవస్థ సామాన్యుడికి నమ్మకం కలిగించేలా పని చేయగలగాలని పేర్కొన్నారు. డాక్టర్‌తో ఒక పేషెంట్‌కు ఉన్న అనుబంధం ఏవిధంగా ఉంటుందో.. అలాగే ఒక న్యా యవాదికి కక్షిదారుడికి కూడా అదే విధమైన అనుబం ధం ఉంటుందని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా లో నూతన కోర్టు భవనానికి ఇప్పుడు కేటాయించిన 10 ఎకరాల స్థలం సరిపోదని, 25 ఎకరాల స్థలం కచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించడం జరిగిందన్నారు. ఇంత విశాలంగా ఉన్న స్థలంలో చాంబర్లు, లైబ్రరీ, హాల్, ఏటీఎం, స్టాం పుల కొనుగోలు కేంద్రం, కనీస అవసరాల గదులు, పా ర్కింగ్ వీటిన్నింటిని ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందన్నారు.

జూనియర్లకు సీనియర్లు సహకరించాలి..
న్యాయవాద వృత్తిలోకి అగుడు పెట్టే కొత్త న్యాయవాదుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహాన్ అన్నారు. జూనియర్ న్యాయవాదుల బాధలు తనకు ప్రత్యక్షంగా తెలుసని చెప్పారు. తాను న్యాయవాదిగా 33 సంవత్సరాలు పని చేశానని పేర్కొన్నారు. న్యాయ పట్టా చేతికందగానే న్యాయవాదిగా అతను తన పేరును నమోదు చేసుకుని కొత్త ఆశలతో కోర్టులో అడుగు పెట్టడం జరిగితే, ఇబ్బందులతో ఉండి వృత్తిలో కొనసాగే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసన్నారు. ఇక్కడ ఉన్న సీనియర్ న్యాయవాదుల్లో మెరుగ్గా స్థిరపడ్డ వారు జూనియర్ల పరిస్థితిని ఆలోచించాలని చెప్పారు. పని నేర్చుకునే క్రమంలో జూ నియర్ న్యాయవాదులు పుస్తకాలను తక్కువగా చదివి సీనియర్‌తో ఎక్కువగా విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని సూచించారు. వృత్తిలో మెళకువలను అర్థం చే సుకోవాలంటే క నీసం 10 సంవత్సరాలైన పడుతుంద ని పేర్కొన్నారు. మీరంతా నా కుటుంబ సభ్యుల్లాంటి వారని, సీనియర్లు జూనియర్ల పట్ల శ్రద్ధ కనబర్చి వారికి సహకరించాలన్నారు.

పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని, ప్రయత్నిస్తే కొంత సమయంలో ఆ సమస్య ల పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ న్యాయ వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. సమస్యలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీ. సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లా స్థాయి కోర్టులకు వచ్చి సమస్యలను తెలుసుకుని స్పందించిన వా రిలో మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈయనేనని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన న్యా యమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కలిసి కోర్టు భవ న నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రఘురాం, అజిత్‌సింహారావు, చంద్రశేఖర్, తేజోకార్తీక్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

కోర్టు సముదాయం పరిశీలన..
జిల్లా కోర్టు భవనంతోపాటు, కోర్టు సముదాయంలోని వివిధ కోర్టుల భవనాలను హైకోర్టు తాత్కాలిక ప్ర ధాన న్యాయమూర్తి రాఘవేంద్ర ఎస్.చౌహాన్ పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు, మొదటి అనదపు కోర్టు, డీఎల్‌ఎస్‌ఏ భవనం, సబ్ కోర్టు, తదితర భవనాలతోపాటు తహసీల్దార్ కార్యాలయం దగ్గర కేటాయించిన పార్కిం గ్ స్థలం, న్యాయమూర్తుల నివాస గృహాలను సందర్శిం చి చూశారు. అక్కడి పరిస్థితిని జిల్లా న్యాయమూర్తి జీ వీ. సుబ్రమణ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. అనంతరం ఆయన న్యాయమూర్తులు, మ హబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో కేటాయించిన ప్కారింగ్ స్థలాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చి వినియోగంలోకి తీసుకురావాలాని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. అలాగే, న్యాయ సేవా సదన్ భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి అక్కడి సమస్యలను న్యాయ సేవా సదన్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు.

న్యాయమూర్తికి ఘన సన్మానం..
మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని శాలువా, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. అనంతరం బార్ అధ్యక్షుడు అనంతరెడ్డి నేతృత్వంలో పలు సమస్యల పరిష్కారంపై వినతిపత్రం అందచేశారు. కోర్టు నూతన భవ నం, న్యాయమూర్తులు, ఉద్యోగుల భర్తీ వంటి అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, ప్రొటోకాల్ విధులకు ఇతర ఉద్యోగుల నియామకం, జీవో. ఎం.ఎస్.100 అమలు తదితర 18 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని జుడీషియల్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీరాంకుమార్, కార్యదర్శి మోహన్ రామయ్య, అవేజ్, రాజశేఖర్, మురళీధర్, నాగరాణి, వెంకట్రావు, రామకృష్ణ, విల్సన్, ఎస్.లకా్ష్మరెడ్డి, జుడీషియల్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జీ.కోటేశ్వర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి కే.శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles