గుబాళించిన గులాబీ

Sat,May 25, 2019 01:43 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎ న్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షే మ పథకాలకు ప్రతిరూపంగా మారా యి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్ల నుంచి పె ద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోం ది. ముఖ్యంగా సాగునీటి రంగానికి ఇచ్చి న ప్రాధాన్యత రాష్ట్రంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ చిత్రాన్నే మా ర్చేసింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వల్ల నాగర్‌కర్నూల్, (ఖిల్లాఘనపూర్)వనపర్తి జిల్లాతో పాటు జడ్చర్లలోని మిడ్జిల్ ప్రాంతానికి కూడా సాగునీరు అందిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పట్టించుకోని ఈ ప్రాజెక్టును టీఆర్‌ఎస్ గత నాలుగేళ్ల క్రితం ప్రారంభింపజేసింది. దీనివల్ల వలసల ప్రాంతం గా పేరొందిన నాగర్‌కర్నూల్ ఇతర రా ష్ర్టాల కూలీలకే ఉపాధి కల్పించే కేంద్రం గా మారింది. బీహార్, ఒరిస్సా, కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యవసాయ, ప్రాజెక్టు పనులు చేస్తూ పొట్ట పో షించుకొంటున్నారు. ఇక ఇక్కడి నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగొచ్చి ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లతో పాటు తరలివచ్చిన కృ ష్ణమ్మ నీటితో పచ్చగా మారుతున్న పొ లాల్లో పనులు చేసుకుంటూ పిల్లాపాల లు, బంధువులతో కలిసి జీవిస్తున్నారు.

ఇలా కృష్ణమ్మ నీటితో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా ప్రతి సీజన్‌లో నాగర్‌కర్నూల్, వనపర్తిలో రికార్డు స్థాయిలో వేరుశనగ పం ట దిగుబడి వస్తోంది. దీనివల్ల మార్కెట్ యార్డులన్నీ ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి. ఇక గద్వాల ప్రాంతంలోనూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అక్కడి ప్రజ ల్లో టీఆర్‌ఎస్ పట్ల నమ్మకాన్ని పెంచింది. రూ.750 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గతేడాది ప్రారంభం కా గా మొదటి విడతలో పనులు పూర్తయ్యా యి. ఒక పంపు ద్వారా నీటి విడుదల జ రుగుతుండగా 80వేల ఎకరాలకు గానూ 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇక రూ.2వేల కోట్లు అం చనా వ్యయంగా భావిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పనులు డీపీఆర్ కూడా పూర్తయ్యింది. 15టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించేందు కు ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల గ ద్వాల వాసుల్లో సంతోషాన్ని నింపాయి. అదే విధంగా జూరాల నీటి నిల్వలు పడిపోవడంతో సీఎం కేసీఆర్ కర్నాటక ము ఖ్యమంత్రితో మాట్లాడి 2టీఎంసీల నీరు విడుదల చేయించారు. ముఖ్యంగా ఉ మ్మడి పాలమూరు జిల్లాలో 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం పనులు శరవేగంగా జరుగుతున్నా యి.

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో కొల్లాపూర్ వద్ద అంజనాద్రి రిజర్వాయర్ (5.41టీఎంసీ), నాగర్‌కర్నూల్ వట్టెం వద్ద వెంకటాద్రి రిజర్వాయర్(14.37టీఎంసీ), వనపర్తిలోని ఏదుల వద్ద రిజర్వాయర్(4.37టీఎంసీ)పనులు ఆంధ్రాభిమానులు అడ్డుకోవడంతో కాస్త జాప్యమైనా ఇటీవలే పర్యావరణ అటవీ అనుమతులు వచ్చాయి. ఏదుల రిజర్వాయర్ దాదాపు పూర్తయ్యింది. అదే విధంగా ఎంజీకేఎల్‌ఐ అనుబంధంగా 20కిపైగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాల చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఇలా కందనూలు పార్లమెంటరీ పరిధిలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూపెడుతున్న ప్ర త్యేక దృష్టి ప్రజల్లో నమ్మకాన్ని పెంచు తూ వస్తున్నాయి. ఫలితంగా గత ఆరు నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాలను కట్టబెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటరీ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 90శాతానికిపైగా మె జార్టీని ప్రజలు అందించారు. దీంతో ఏ డింటికి గానూ ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంతరం జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ 100మందికిపైగా సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. ఇక ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా టీఆర్‌ఎస్‌కే మా ఓటు అంటూ ప్రజల ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు.

వచ్చే సోమవారం వెలువడే పరిషత్ ఎన్నికల ఫలితాలు కూ డా టీఆర్‌ఎస్ పక్షంగానే మారనున్నా యి. ఈ ఎన్నికల ప్రచారాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఆదరణ ఇతర పార్టీలకు ముందుగానే ఓటమిని ఖరారు చే స్తోంది. దీనివల్ల ఆయా పార్టీల నాయకు లు ప్రచారాలకు రావడంతో మారేదేమీ లేదంటూ ఇండ్లల్లకే పరిమితమయ్యారు. అదే టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరును కలిసి ధైర్యంగా ఓట్లు అడిగే పరిస్థితులు వచ్చా యి. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్ నుం చి టిక్కెట్లు ఆశించే అభ్యర్థుల సంఖ్య కూడా ప్రతి ఎన్నికకూ పెరుగుతూ వస్తోంది. సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణతో టీఆర్‌ఎస్ టిక్కెట్ ద క్కితే గెలుపు ఖాయం అనేలా కందనూ లు రాజకీయ ముఖచిత్రం మారడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మాజీ మంత్రులు కూడా టీఆర్‌ఎస్ బలోపేతంలో సఫలీకృతులవుతున్నారు. ఫలితమే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌గా ఆవిర్భవించినప్పటి నుంచి రాని 1.89 లక్షల భారీ మెజార్టీ కారు గుర్తుకు లభించింది. తొలిసారిగా టీఆర్‌ఎస్ ఎంపీ అ భ్యర్థి పార్లమెంట్‌లో నాగర్‌కర్నూల్ నుం చి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles