నాణ్యమైన విత్తనాలు అందించడమేప్రభుత్వం లక్ష్యం

Sat,May 25, 2019 01:42 AM

-జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్
గద్వాల,నమస్తేతెలంగాణ: సకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి దిగుబడులు పెంపోందించే ఉద్ధేశ్యంతో విత్తన మేళా ప్రభుత్వం ని ర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్ తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్య వసాయ విశ్వవిద్యాలయంలో జరిగే విత్తన మేళా కార్యక్రమానికి జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి రైతులతో పాటు విత్తన డీలర్లను ఆయన వాహనాల్లో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి రైతులు, వాహ నాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళా ద్వారా రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అం దించడంతో పాటు వాటి గుణ గణాలు , నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విత్తన మేళాలో మొ త్తం 24స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే రైతులు వారు సాగే చేసే పంట పొలాల్లో యాజమాన్య పద్ధతులు తెలుసుకోవడంతో పాటు పంట ఉత్ప త్తి, ఉత్పాదకతలు పెంచుకోవడానికి సంబంధించి ఈ విత్తన మేళాలో రైతులకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తన మేళాలో రైతులకు అవసరమైనా 8పంటల్లో 27రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతారని విత్తనాలు రాయితీ పొందలనుకునే రైతులు తమ వెంట పాస్‌పుస్తకాలు తీ సుకుని వస్తే రాయితీ విత్తనాలు అంది స్తారని తెలిపారు. విత్తన మేళాలో రైతు లు పాల్గొనడం వల్ల రైతులు సాగు చేసే పలు పంటల వివరాలు తెలుసు కోవడంతో పాటు నూతన వంగడాలు సాగు ఎలా చేపట్టాల్లో తెలుసు కుంటారన్నారు. మేళా పాల్గొన్న రైతులు,విత్తన డీలర్లు వారు విత్తన మేళాలో తెలుసుకున్న విషయాలు వారి గ్రామాల్లో ఇతర రైతులకు తెలియజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles