అన్ని ఏర్పాట్లు చేయండి

Sat,May 25, 2019 01:41 AM

-రౌండ్ల వారీ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయండి
- మధ్యాహ్నం లోగా లెక్కింపు పూర్తికావాలి
- రిటర్నింగ్ అధికారులతో సమావేశంలో కలెక్టర్ శశాంక
గద్వాల,నమస్తేతెలంగాణ: ఈ నెల 27న జరిగే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం అన్ని సదుపాయాలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమా వేశపు మందిరంలో జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు, రిటర్నింగ్ అధికా రులతో సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల్లోని హాళ్లలో ఫెన్సింగ్, టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. వీటితో పాటు మెటీరియల్, సైన్‌బోర్డులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని మండల అభివృద్ధి అధికారులు,రిటర్నింగ్ అధికారు లను ఆదేశించారు. లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభం కావాలని అందుకు లెక్కింపు సిబ్బంది ఉదయం 6:30గంటల వరకు కేంద్రాలకు చేరుకునేలా చూ డాలన్నారు. 6:45కు స్ట్రాంగ్ రూములు తెరిచే విధంగా ముందస్తు చ ర్యలు తీసుకో వాలన్నారు. లెక్కింపు బృందాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వారు సకాలంలో సమాచారం అందజేసే టట్లు చూడాలన్నారు. లెక్కింపు సందర్భంగా ఎవరెవరు ఎ లాంటి విధులు నిర్వహించాలో ముందుగానే స్పష్టంగా ఆదేశాలు జారీచేయాల న్నారు. లెక్కింపు ప్రకియ మొత్తం వీడియో కవరేజ్ చేయించడంతో పాటు వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రౌండ్ల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు మ్యాన్‌వ ల్‌తో పాటు కంప్యూటర్‌లో టీపోల్ ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టెందుకు సరిపడా కంప్యూ టర్లు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం లోగా లెక్కింపు ప్రక్రియ పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు కృష్ణ, యాదయ్య, తహసీలార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles