సంక్షేమ పథకాలే గెలిపించాయి

Sat,May 25, 2019 01:41 AM

-తెలంగాణను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్ధిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-సీఎం సహకారంతో ప్రతి గుంటకు సాగునీరు అందిస్తా
-విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేస్తా
-విలేకర్ల సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు
వెల్దండ : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్ ఎంపీల గెలుపునకు నాంది అని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాము లు అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిద్ధిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించి విద్య, వైద్య రం గాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. సీ ఎం కేసీఆర్ వల్లే నేడు నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు సేవచేసే భాగ్యం కల్గిందని, అదే విధంగా మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషిచేసి నా గెలుపునకు బాటలు వేశారన్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలో ఏనాడు లేని విధంగా ఎంపీగా నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించారని అందుకు ప్రతి ఒక్కరికీ ఋణపడి ఉంటానన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి నియోజకవర్గంలో ప్రతి గుంటకు సాగునీరు అంది ంచేందుకు కృషి చేయడంతోపా టు ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటానన్నా రు. కార్యక్రమంలో ఎంపీ సతీమణి భాగ్యలక్ష్మి, వెల్దండ, బండోన్‌పల్లి స ర్పంచులు భూపతిరెడ్డి, అంజయ్య, నాయకులు యాదగిరి, సమీర్‌బాబా, వెంకటయ్య, మల్లయ్య ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles