నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Thu,May 23, 2019 12:49 AM

-నకిలీ విత్తనాల సమాచారం పోలీసులు, వ్యవసాయ అధికారులకు అందించాలి
-కలెక్టర్ శశాంక
-కలెక్టరేట్‌లో సీడ్‌కంపెనీ, ఆర్గనైజర్లతో సమావేశం

గద్వాల, నమస్తేతెలంగాణ: నకిలీ సీడ్ పత్తి విత్తనాలను కంపెనీ ప్యాకెట్లలో చేసి తిరిగి రైతులకు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షించడం జరుగుతుందని కలెక్టర్ శశాంక కంపెనీలను, ఆర్గనైజర్లను హెచ్చరించారు. బు ధవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఎస్పీ లక్ష్మీనాయక్‌తో కలిసి సీడ్‌కంపెనీలు, ఆర్గనైజర్లతో కలిసి సీడ్ విత్తన అమ్మకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో రైతులు ఇ ప్పటికే చాలా అప్పులు, కష్టాల్లో ఉన్నారని తెలిపారు. మన దగ్గర సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పరీక్షలు చేసి పునరుత్పత్తి అయ్యే విత్తనాలను రైతుల నుంచి తీసుకుని జర్మినేషన్ ఫేయిల్ అయినా తర్వాత ఈ విత్తనాలు తమకు అవసరం లేదని తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నారన్నారు. రైతులు కక్కుర్తి పడి ఫేయిల్ అయిన సీడ్‌ను ఇతర కంపెనీలు, ఆర్గనైజర్ల సహా యంతో తిరిగి ప్యాకెట్లు చేసి దుకాణాల్లో అమ్మడానికి పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.

ఆ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తిరిగి వ్యవసాయ పొ లంలో వాటిని విత్తుతున్నారని మరో రైతును తాము మోసం చేస్తున్నామన్నా ఆలోచన మిగతా రైతుల్లో లేకపోవడం బాధకరమని కలెక్టర్ అన్నారు. ఈ వి ధంగా నకిలీ విత్తనాలు పొలంలో వేసి న రైతులు మొక్క పెద్దదై పూత కాసే సమయానికి గాను అతను వేసుకున్నది నకిలీ విత్తనాలను గుర్తించలేక పోతున్నాడ న్నారు. ఆరైతు నకిలీ విత్తనాలు వేసుకున్నాని తెలుసుకున్నాక వారు అప్పటికే పొలంపై లక్షల రూపాయలు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయి అ ప్పుల పాలు అవుతున్నారని కలెక్టర్ చెప్పారు. అందువల్ల ఇక నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాలు కొని మోసపోకూడదని ఒక రైతు ఇంకో రైతు నోట్లో మట్టి కొట్ట కూడదనే మంచి ఉద్ధేశ్యంతో ఈ సమావేశం నిర్వ హించినట్లు కలెక్టర్ తెలిపారు.

నకిలీ విత్తనాల అమ్మకంలో కంపెనీ, ఆర్గనైజర్ల పాత్ర లేనిదే నకిలీ విత్తనాలు బయటకు వెళ్లవన్నా రు. నకిలీ విత్తనాలను వ్యవసాయ చట్టం ప్రకారం నాశనం చేయాలి లేదా వా టిని పశువులకు దాణగా వినియోగించుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అ మ్ముతున్న విషయం తెలిసిన వెంటనే వ్యవసాయఅధికారులతో పాటు పోలీసులకు వెం టనే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ భరో సా ఇచ్చారు. నకిలీ విత్తన వ్యవ హారంలో కంపెనీలు, ఆర్గనైజర్ల పాత్ర ఉందని తెలిసిన వారిపై కఠినంగా వ్యవహారిస్తామన్నారు. వారిని జైలుకు పంపాడానికి వెనుకాడమన్నారు. అం దుకే ముందస్తుగా ఈ సమావేశం ఏ ర్పాటు చేసి అందరికీ తెలియజేస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలో జిల్లాలో ని అన్ని మండలాల్లో కాటన్‌సీడ్ రైతులతో పాటు దానికి సంబంధించిన వ్యా పారులతో మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందనాయక్‌కు ఆదేశించారు.

అదే విధంగా రైతులకు అవగాహన కల్పించడానికి పోస్టర్లు, కరపత్రాలు, జానపద కళాకారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ ఇప్పటికే రైతులు చాలా దీనావస్థలో ఉన్నారని ఈ నకిలీ విత్తనాలు వారికి అంటగట్టి వారిని మరింత నష్టపోయే విధం గా చేయవద్దని సూచించారు. ఇలాం టి అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జిల్లాలో కంపెనీలతో పాటు ఆర్గనైజర్లు రైతులకు మంచి విత్తనాలు మాత్రమే ఇచ్చి మరింత ఎక్కువ సీడ్ ఉత్పత్తి అయ్యే లా చూడాలన్నారు. గద్వాల సీడ్ అం టే దేశంలో అందరూ గర్వపడేలా ఉం డాలన్నారు. సీడ్ కంపెనీ అధికారులు, ఆర్గనైజర్లు మాట్లాడుతూ జిల్లాలో ఎ లాంటి నకిలీ విత్తనాలు సరఫరా కా కుండా మా వంతు కృషి చేయడంతో పాటు నకిలీ విత్తనాలను అరికట్టడంలో అధికారులకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మండల స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ని ర్వహించాలని కోరారు. ఈ సమావేశం లో సీడ్‌ఆర్గనైజర్లు బండ్ల రాజశేఖర్‌రెడ్డితో పాటు కంపెనీ అధికారులు తది తరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles