చెస్‌తో మేధస్సుకు పదును

Thu,May 23, 2019 12:46 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : చెస్‌తో మేధస్సుకు పదును వస్తుందని, చదువుతో పా టు క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు బంగా రు భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శ్రేష్ఠ స్పోర్ట్స్ కల్చరల్ అకాడమీ, శ్రేష్ఠ హైస్కూల్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాసకాలనీలో ఉమ్మడి చెస్ టోర్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం ల భిస్తుందని, చెస్ మేధస్సును పెంచుతుందన్నారు. ఉమ్మడి జిల్లా చెస్ టోర్నీ నిర్వహించడంపై శ్రేష్ఠ స్పోర్ట్స్ కల్చరల్ అకాడమీ, శ్రేష్ఠ హై స్కూల్ నిర్వహకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, ఎంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. శ్రేష్ఠ స్కూల్ కరస్పాండెంట్ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చెస్ పోటీలు నిర్వహించామని, వేసవి కరాటే శిబిరంతో పాటు కల్చరల్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సాయంత్ర విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ రాము లు, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, డైరెక్టర్ స్వప్నలత, మాస్టర్లు కేశవ్‌గౌడ్, ఆనంద్ పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles