అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..

Thu,May 23, 2019 12:45 AM

అలంపూర్ నమస్తే తెలంగాణ : ఆదివారం కురిసిన వడగళ్ల వర్షంతో ఆస్తుల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని మారమునగాల-1,2 గ్రామాలల్లో వడగళ్ల వానకు ఇంటిపైకప్పు కులిన బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మారమునగాల మాజీ సర్పంచ్ ఈరన్నగౌ డ్, ఆయన కుమారుడు రవిప్రకాష్‌గౌడ్ దా తలుగా ముందుకు వచ్చి తక్షణ సాయంగా ఎమ్మెల్యే అబ్రహం చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించారు. గ్రామానికి చెందిన సత్యనారాయణకు రూ.3వేలు, రాములమ్మ కు రూ.2500, విజేయుడుకు రూ.2500, ఆంజనేయులకు రూ.1500, రాజుకు రూ. 2వేలు, నరసింహ్మకు రూ.1500, మారమునగాల-2, నాగరాజుకు రూ.2వేలు, కురుమన్నకు రూ.2వేలు, మసీదు నిర్వాహకులకు రూ.3వేలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఆపద సమయంలో వడగళ్ల బాధితులకు మానత్వ దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఈరన్న గౌడ్‌ను, రవిప్రకాష్‌గౌడ్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం తరుపున కూడా 8కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏ ఆపదవచ్చిన అన్ని రకాలుగా అందు కుంటుందని ఆధైర్యపడవద్దన్నారు. మారమునగాల-2లో మసీదు మీనార్ కులిపోయిందని ఈ విషయాన్ని మైనార్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేవిధంగా చూస్తాన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివనారాయణ, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కురుమూర్తి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకట్రామన్‌గౌడ్, బాలరాజు, మల్లికార్జున్, రామ్‌బాబు, మాజీ సర్పంచ్ ప్రసాద్, అలీహ్మాద్, కిశోర్ పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles