అట్టహాసంగా ముగిసిన బండలాగుడు పోటీలు

Thu,May 23, 2019 12:43 AM

మానవపాడు: మండలంలోని జల్లాపురంలో ఈదమ్మ దేవర ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. కేటగిరీల వారిగా గ్రామస్తులు బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి ఎనిమిది జతల వృషభరాజములు (ఎద్దులు) పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీలను తిలకించడానికి వచ్చిన ప్రజలకు మంచినీటి వసతి, పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి భోజన వసతి కల్పించారు. గెలుపొందిన వృషభరాజముల జతలకు దాతల సహకారంతో బహుమతులు అందజేశారు. గ్రామానికి చెందిన చంద్రకళ వృషభరాజములు మొదటి బహుమతి రూ. 35వేలు కైవసం చేసుకున్నాయి. ద్వితీయ బహుమతి జోగుళాంబ గద్వాల జిల్లా ధర్మవరానికి చెందిన వృషభరాజములు రూ. 25వేలు అందుకున్నాయి. మొత్తం ఐదు బహుమతులు ఏర్పాటు చేసి గెలిపొందిన జతలకు స్థానిక నాయకులు అందజేశారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles