అకాల వర్షం - అపార నష్టం

Tue,May 21, 2019 03:51 AM

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : ఆదివారం సాయంత్రం, రాత్రి కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని గుందిమల్లలో చెట్టు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు కూలిపోగా.. ఇంటిముందున్న రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారి పంచ నామ చేశారని సర్పంచ్‌ వసుంధర పెద్దా రెడ్డి తెలిపారు. అధికారులు చొరవ చూపి బాదిత కుటుంబాలను ఆదుకోవాలని కో రారు. అదే విధం గా ఉండవెల్లి మండలంలోని వివిధ గ్రామా ల్లో ఆదివారం రాత్రి మోస్తరు వ ర్షం కురిసింది. మా రమునగాల-1 గ్రా మంలో ఈదురుగాలులు, వడగళ్ల వానతో గ్రామంలో సుమారు 40వేప వృక్షాలు నేలకొరగ డంతో పాటు గ్రామానికి చెందిన కమతం సత్యన్న, రాములమ్మ, దాసరి గట్టమ్మ ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరి పోయాయి. కాగా సత్యన్న కుమారుడు దస్తగిరి పెళ్లి ఈనెల 23న ఉండటంతో వివాహనికి సంబంధించిన సరుకులు వర్షంలో తడిసిపోయా యి. మరో 20 కుటుంబాల ఇంటి ముం దు నీడ కోసం వేసుకున్న రేకుల షెడ్డులు గాలికి కొట్టుకోనిపోయాయి. మారమునగాల-2లో మసీద్‌ మీనారు, మారమనగాల 1, శేరుపల్లిలో విద్యుత్‌ స్తంభాలు నెలకొరగాయి. దీంతో రాత్రి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వి ద్యుత్‌ సరఫరా లేక మారమునగాల, శేరుపల్లి, ప్రాగటూర్‌, తక్కశిల గ్రామా ల ప్రజలు తాగునీటి మోటర్లు పనిచేయక ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి రెవున్యూ అధికారులు గ్రామానికి చేరుకున్ని ఆస్థి నష్టంపై పంచానామ నిర్వహించారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles