పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Fri,May 17, 2019 01:13 AM

-డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలి
-వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
-ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేంద్రకుమార్‌
-జెండాఊపి అవగాహన ర్యాలీ ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో
గద్వాలటౌన్‌: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుం చుకోవాల్సిన అవసరం ఉందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేం ద్రకుమార్‌ అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పుసర్కరించు కుని గురువారం జిల్లా కేంద్రం గద్వాలలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వ ర్యం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక దోమ కాటు వివిధరోగాలకు కారకంగా నిలుస్తుందన్నారు. అందుకు పరి సరాల్లో, ఇంటి ఆవరణంలో నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఎందుకంటే నీటి నిలువ ఉన్న ప్రాంతాల్లోనే డెంగ్యూ దోమలు పెరిగుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మనం తాగే, తినే ప్రతి దానిపై మూతలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. అలాగే దోమలతో ప్రబలే రోగాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిప బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వ్యాధుల నివారణకు అధికారులు, వైద్యసిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్లు శశికళ, మాలకొండయ్య, డీపీఎంవో మల్లికార్జున్‌, సీహెచ్‌వో రామకృష్ణ, హెచ్‌ఈలు శ్రీరాం సుధాకర్‌, మదుసూధన్‌ రెడ్డి, సూపర్‌వైజర్స్‌, ఏఎన్‌ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles