బెస్ట్‌ అవేలబుల్‌ పాఠశాలలో

Fri,May 17, 2019 01:12 AM

- అడ్మిషన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల, నమస్తేతెలంగాణ: 2019-20 విద్యాసంవత్సరానికి జిల్లాలో అర్హులైనా ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల నుంచి బెస్ట్‌అవేలబుల్‌ పాఠశాలలో ఒకటోతరగతి(డేస్‌స్కాలర్‌) ఐదోతరగతి(రెసిడెన్సియల్‌)లలో ప్రవేశానికి షెడ్యూల్డ్‌ కులానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షె డ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రాములు కోరారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణప్రాంతాలకు చెందినవారైతే రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు మించి ఉండరాదన్నారు. పూర్తి చేసి న దరఖాస్తులను జూన్‌ 7లోగా జిల్లా షెడ్యూ ల్డ్‌ కు లాల అభివృ ద్ధి అధికారి కార్యాలయం (దానఫ్యాక్టరి వద్ద హీరో షోరూం పక్కన)లో అందజేయాలని ఆయ న సూచించారు. ఒకటోతరగతిలో ప్రవేశం కోసం విద్యార్థులు తమ కుల, ఆదాయ పత్రాలు మీ సేవా ద్వారా పొందినవి దరఖాస్తు వెంబడి జతపర్చాలన్నా రు. వీటితో పా టు పుట్టిన తేది సర్టిఫికెట్‌(31-0520 13-0106-2014మధ్యజన్మించిన వారై ఉ ండవలెను)తో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు జిరాక్స్‌ ప త్రాలు గెజిటెడ్‌ అధికారిచే సంతకం చేయించి దరఖాస్తుకు రె ండు ఫొటోలు జతపరిచి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఐదోతరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు కులం, ఆదాయం, 4వ తరగతి పాసైన మార్కు ల జా బితాతో పాటు బోనఫైడ్‌, ఆధార్‌, రేషన్‌కార్డు ప్ర తులు గెజిటెడ్‌ అధికారిచే సంతకాలు చేయించి దరఖాస్తుతోపాటు రెండు ఫొటోలు కార్యాలయంలో సమర్పి ంచాలన్నారు. వివరాలకు 70132810 77,7981 067 369, 7799977767కు సంప్రదించాలన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles