నిబద్ధతతో పనిచేయాలి

Fri,May 17, 2019 01:12 AM

గద్వాల, నమస్తేతెలంగాణ: పంచాయతీ కార్యదర్శులు నిజాయితీ, నిబద్ధతతో తమ కర్తవ్యాలను నేరవేర్చినప్పుడు ఆ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెం దుతుందని అందుకని పంచాయతీ రాజ్‌ చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి తమ గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ అన్నారు. గురువారం అలంపూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని ఏ ర్పాటు చేశారు.గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల అధికారాలు, బాధ్యతలు, విధులు వారు చట్టం ప్రకారం గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత గ్రామ జనాభా వారి ఆర్థిక స్థితిగతులు అన్ని పంచాయతీ కార్యదర్శులు అవగాహన కలిగి ఉండాలన్నారు.గ్రామానికి విద్యుత్‌ అధికారి ఎవ రు, ఎన్ని ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి ఎన్ని ఇళ్లకు లేవు, బోరు బావులు ఎన్ని ఉన్నాయి వాటిలో ఎన్నింటికి ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి వీధి దీపాలు ఎన్ని ఉన్నాయి డ్రైనేజీలు ఉన్నాయా లేదా గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారా ఇలా అన్ని విషయాలపై గ్రామ కార్యదర్శి ఒక నివేదిక రూపొందించుకోవాలని సూచించారు. కొత్తగా వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంలో చాలా విషయాలు కొత్తగా చేర్చ డం జరిగిందని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు వారి బాధ్యతలపై స మగ్రంగా నియమ నిబంధనలు అందులో సూచించారన్నారు. ఈ చట్టం గురించి బా గా చదివి అర్థం చేసుకోవాలన్నారు.పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక లావాదేవిలు అధికారికంగా ఏ విధంగా జరపాల్పి ఉం టుంది బ్యాంకు ఖాతాల నిర్వాహణ గు రించి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ జయప్రకాష్‌ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles