వేసవి శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ఇన్‌చార్జి డీఈవో

Fri,May 17, 2019 01:11 AM

గద్వాల న్యూటౌన్‌ : గద్వాలలోని ఇండోర్‌లో స్టేడియంలో కొనసాగుతున్న క్రీడాకారుల వేసవి శిక్షణా శిబిరాన్ని గురువారం ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి సుశీంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులో పాటు ఆ యన స్టేడియంలో వాకింగ్‌ చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌, కబడ్డీ, క్రికెట్‌ తదితర క్రీడలు ఆడి వారిలో ఉ త్సాహన్ని నింపారు. తైక్వాం డో కరాటే విద్యార్థుల ప్రతిభను పరిక్షీంచారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతతను కలుగజేస్తాయన్నా రు. ప్రతి విద్యార్థి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో త మకిష్టమైన క్రీడకు కూడా అం తే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభ.. ఫిజికల్‌ ఫిట్నెస్‌తో పాటు వారికిష్టమై న క్రీడల్లో రాణించేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్‌ ఆనంద్‌, వ్యాయామ ఉపాధ్యాయులు జితేందర్‌, సతీష్‌, నగేష్‌, కృ ష్ణంరాజు, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles