ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలి

Thu,May 16, 2019 12:59 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌ కోరారు. బుధవారం ఆయ న జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఓట్ల లెక్కింపు రోజున ఓట్ల లెక్కింపు కేంద్రంలో అభ్యర్థులు, వారి ఏజెంట్లు పాటించవల్సిన నియ మ, నిబంధనలు, ఓట్ల లెక్కింపు ప్రక్రి య తదితర అంశాలపై వివరించారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉ య్యాలవాడ సమీపంలోని మాడల్‌ బీ ఈడీ కళాశాల, నెల్లికొండ మార్కెట్‌ యార్డులో నిర్వహించడం జరుగుఉందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేది లోగా ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారి ఏజెంట్ల వివరాలు, ఫోటోలతో సహా సమర్పించాలని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారి, అభ్యర్థులు లేదా వారి ఏజెం ట్ల సమక్షంలోనే తెరవడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థు లు, ఏజెంట్లు ఉదయం 7 గంటలకే కౌ ంటింగ్‌ హాల్‌కు చేరుకోవాలని కోరారు.

నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్లలో ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మీడియా ప్రతినిధులను మీడి యా కేద్రం వరకు ఎన్నికల సంఘం జా రీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్ర మే అనుమిస్తారన్నారు. అక్కడి నుండి ప్రత్యేకంగా నియమించబడిన అధికారులు ఒక్కోసారి ఐదుగురిని ఎస్కార్ట్‌గా తీసుకొని వెళ్లి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన డయాస్‌ నుంచి మీడియా ప్రతినిధులు ఫొటో లు, లేదా వీడియో తీసుకునేందుకు అ నుమతి ఉంటుందన్నారు. ఫొటో, వీడి యో జర్నలిస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలపై అభ్యర్థుల వారీగా నమోద య్యే ఓట్ల సంఖ్య, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర వాటిని అందరికి కన్పించేలా తీయడానికి అనుమతి ఉండదని, దూరం ను ంచి తీసుకోవచ్చన్నారు. ఈ నెల 26న ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లాకు వస్తారని, ఆ రోజు న పోటిచేసిన అభ్యర్థులందరు హాజరై వారికి సంబంధించి న ఖర్చుల లెక్కలను ఫైనల్‌ చేయవలసి ఉంటుందన్నా రు. ఎవరైనా అభ్యర్థి ఈ సమావేశానికి హాజరు కాకున్నా, ఖర్చు ల వివరాల తుది నివేదిక సమర్పించకపోయినా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌, నో డల్‌ అధికారులు, అభ్యర్థులు శృతి, స్వ తంత్య్ర అభ్యర్థి శరత్‌, టీఆర్‌ఎస్‌ నుంచి భరత్‌, బీజేపీ నుంచి శ్రీనివాస్‌, సుబ్బారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి డేవిడ్‌రాజు, బీఎ స్పీ నుంచి నాగన్న పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles