రైతులకు మెరుగైన సేవలందించాలి

Thu,May 16, 2019 12:59 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: బ్యాంకర్లు రైతులకు మెరుగైన సేవలు అందించాలని వారికి రుణాలు ఇవ్వడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని కలెక్టర్‌ శశాంక బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో బ్యాంకు మేనేజర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల, గ్రామాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ బ్యాంకులో ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న కార్మికులకు ఇన్సూరెన్స్‌ను కట్టించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుడికి ప్రమాదం జరిగినప్పుడు ఎంత ఆర్థిక సాయం అందుతుందో కలెక్టర్‌ అడి గి తెలుసుకున్నారు. బ్యాంకులు రైతుల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఫైల్స్‌ పెండింగ్‌లో పెట్టు కోవద్దని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన పంట అమ్మడానికి వచ్చినప్పుడు వాటిని నిల్వఉంచుకోకుండా వెంటనే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు.

రైతుల పంటను కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడంతోనే రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుంటున్నారని మీరు ఇక్కడ కొనుగోలు చేస్తే రైతులకు ఈ పరిస్థితి రాదని అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. పురపాలిక సంఘం పరిధిలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు తక్షణమే వసూలు చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్‌సైట్‌లో రైతుల ఆధార్‌ నంబర్‌ డాటా చెక్‌ చేసి వారు ఏ పంట పండించా రనేది తెలుసుకుని రుణాలు అం దించాలన్నారు. ప్రధానమంత్రి, జీవనజ్యోతి వంటి ప థకాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని సూచించా రు. అటల్‌ యోజన పథకం కిం ద 60సంవత్సరాల వరకు కట్టిన తర్వాత ఒక వేళ ప్రమాదం జరిగినప్పుడు అతనికి ఆర్థిక సా యం అందించే క్రమంలో అత ను కట్టిన మొత్తం రుసుం చెల్లించడం జరుగుతుందని బ్యాంక్‌ అధికారులు కలెక్టర్‌కు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందనాయక్‌కు ఆదేశించారు. ఆ దిశగా బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. పురపాలక పరిధిలో బకాయి పడ్డ రుణాలు వెంటనే వసూలు చేసి బ్యాంకులకు చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. డీఆర్‌డీవో ద్వారా మొండి బకాయిలు బాగా రికవరి చేశారని ఆ సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. రైతు బంధులో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రాబ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, ఎస్‌బీఐ మేనేజర్‌ సుబ్బరాజు, కెనరా బ్యాంకు మేనేజర్‌ రాజ్‌కుమార్‌ను కలెక్టర్‌ అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles