l77.81శాతం!

Wed,May 15, 2019 01:20 AM

-నాలుగు మండలాల్లో ప్రశాంతంగా ఎన్నికలు
-4 జెడ్పీటీసీలు, 40ఎంపీటీసీలకు పోలింగ్‌
-పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌ శశాంక
-సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా
-ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్‌
-స్ట్రాంగ్‌ రూములకు తరలిన బ్యాలెట్‌ బాక్సులు
-27న ఓట్ల లెక్కింపు
అలంపూర్‌,నమస్తే తెలంగాణ : తుది విడత పోలింగ్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మంగళవారం ప్రశాం తంగా ముగిసింది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వి నియోగించుకున్నారు. కేంద్రాల వద్ద అధికారులు అవసరమైన అన్ని ఏ ర్పా ట్లు చేశారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఎన్నికల సరళి ని కలెక్టర్‌ శశాంక్‌, ఏఎస్పీ కృష్ణ మ ద్దు రు, చెన్నిపాడు, గుందిమల్ల గ్రా మాల్లో పరిశీలించారు. నియోజకవర్గంలో ఏడు మండలాల్లో మూడు మండలాలు రెండో విడతలో ఎన్నికల పూర్తి కాగా మిగతా నాలుగు మండలాలకు తుది విడతలో అలంపూర్‌, ఇటిక్యాల, మాన వపాడు, ఉండవల్లి మండలాల్లో జరిగాయి. ని యోజకవర్గంలో మొ త్తం 71 ఎం పీ టీసీల స్థానాలు, 7 జెడ్పీటీసీల స్థానా లు ఉన్నాయి. మొత్తం 124 గ్రామ పంచా యతీల్లో మూడు లక్షల యాబై వేల జనా భా ఉండగా వారిలో ఒక లక్షా డబ్బు ఎనిమిది వే ల మంది ఓటర్లు ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో 40 ఎంపీటీసీ స్థా నాలకు 130 మంది అభ్య ర్థులు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో నాలుగు మండలాల్లో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు, 4 జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం పో లింగ్‌ నిర్వహించారు. నాలుగు మండ లాల్లో 194 పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద వృ ద్ధులకు దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల చైర్లు ఏర్పాటు చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రము ఖు లు వారివారి స్వగ్రామాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అ లంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్ర హం ఇటిక్యాల మండ లం వల్లూరు గ్రా మంలో, ఢిల్లీలో ప్ర భుత్వ అధికార ప్రతి నిధి మంద జగ న్నాథం, మంద శ్రీనాథ్‌ కొండేరు గ్రామంలో ఆయా మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులు వారి ఓటు హక్కు ను వినియోగించుకున్నారు

పోలింగ్‌ ప్రశాంతం
మూడో విడత ఎన్నికల్లో అలంపూర్‌ మండలంలో మొత్తం 32 పోలింగ్‌ స్టేష న్‌ లకు గాను నాలుగు రూట్లు ఏ ర్పాటు చేశారు. మంగళ వారం పోలింగ్‌ ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద జిల్లా ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏ ర్పాటు చేశారు.
అలంపూర్‌ మండలంలో 6, ఉండ వెల్లిలో 6, మానవపాడు మం డ లంలో 7, ఇటిక్యాల మం డ లంలో 9 మొ త్తం నాలుగు మం డలాల్లో 28 స మస్యాత్మత పో లీంగ్‌ స్టేషన్‌లపై అధికారులు ప్ర త్యేక దృష్టి పెట్టి పో లీసు బలగాల తో విధులు నిర్వ హించారు. పో లింగ్‌ స్టేషన్‌ల వద్ద అత్యవసర చికిత్స కోసం హెల్త్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles