ప్యాకేజీల వారీగా భూసేకరణ చేయాలి

Wed,May 15, 2019 01:18 AM

-అనంతరం ఇరిగేషన్‌ అధికారులకు అప్పగించాలి
-యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహణకు కృషిచేయాలి
-అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలి
-నెట్టెంపాడు భూ సేకరణ పనుల పురోగతి సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులు పూర్తి చేసేందు కోసం వెంటనే ప్యాకేజీల వారీగా భూ సేకరణ చేసి ఇరిగేషన్‌ అధికారులకు అప్ప గించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళ వారం ఆయన నెట్టెంపాడు భూసేకర పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజె క్టుకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ముందుగా 99(బీ) కింద సేకరిం చాల్సిన 95 ఎకరాలు, ఆ తర్వాత 99 (డీ) ప్యాకేజీ కింద 96 ఎకరాలు, 107 ప్యాకేజీలోని 155 ఎకరాల భూమిని సర్వే చేయించి, వాటిని అవార్డులు, పేమెంట్‌ చేసి ఇంజనీర్లకు అప్పగించాల్సిందిగా గద్వాల ఆర్డీవో రాములును ఆదేశించారు. అలాగే ఇరిగేషన్‌ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక కలెక్టర్‌ భూసేకరణ కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుగా అప్పగించాల్సిన భూముల విషయంలో తొలి ప్రాధాన్యంగా పనులు పూర్తి చేసుకుంటూపోవాలన్నారు. 104, 106 ప్యాకేజీలు అన్ని కలిపి నెట్టెంపా డుకు ఇంకా సుమారు 800 ఎకరాల భూమిని సర్వే చేసి పేమెంటు చేసి అనంతరం అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ముందుగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటికే అవార్డు ప్రకటించి పేమెంటు పూర్తి చేసిన 36 ఎకరాల భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని భూసేకరణ అధికారులను ఆదేశించారు. జూలై నెల వరకు భూమి సేకరించి నెట్టెంపాడు పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్య క్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రఘునాథరావు, ఆర్డీవో రాములు, డీఈ శ్రీనివాస్‌, పీజేపీ ఈఈ రహీముద్దీన్‌, ఇతర డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles