పంట కాలనీల ఏర్పాటుతో రైతులకు సర్కారు భరోసా

Wed,May 15, 2019 01:18 AM

అయిజ : రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరల కల్పించడంతోపాటు నాణ్యమైన విత్తనాలను అందించి రైతులకు భరోసా కల్పించేందుకు పంటకాలనీలను ఏర్పాటు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి గోవిందనాయక్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని రైతు సంఘం కార్యాలయం ఆవరణలో చేపట్టిన రైతు సమగ్ర సమాచార సర్వేను జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమిరెడ్డితో కలిసి పరిశీలించారు. రైతుల నుంచి ప్రభుత్వం సమగ్రమైన వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఫార్మాట్‌ను రూపొందించిందన్నారు. ఫార్మాట్‌ ప్రకారం రైతు సమగ్ర వివరాలను ఏఈవోలు విధిగా సేకరించాలన్నారు. ఇక మీదట ప్రభుత్వం రైతు వివరాల ఆధారంగా విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీతోపాటు రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల సులభంగా విక్రయించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో రైతు సమగ్ర సర్వే ముమ్మరంగా సాగుతుందన్నారు. జిల్లాలోని 12 మండలాలతోపాటు నాలుగు పట్టణాలలో సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఏవో పేర్కొన్నారు. రైతుల నుంచి అన్ని రకాల వివరాలను ఈ నెల 29వ తేదీలోగా సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఏవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో శంకర్‌లాల్‌, ఏటీఎం శ్రీకాంత్‌, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles