పదిలో బాలికలే హవా

Tue,May 14, 2019 05:11 AM

-పదిలో 89.96 శాతం ఉత్తీర్ణత
-బాలికలు 89.68 శాతం..బాలురు 84.43 శాతం పాస్
-రాష్ట్రంలో జిల్లాకు 27వ స్థానం
-సత్తా చాటిన సర్కార్ పాఠశాల విద్యార్థులు
-100 శాతం ఫలితాలు సాధించిన 8 ప్రభుత్వ బడులు
- గతేడాది కంటే పెరిగిన 10.81ఉత్తీర్ణత శాతం
గద్వాల న్యూటౌన్ : సోమవారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర 2018-19 వి ద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా 89.96శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలిచింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించా రు. 7,521 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 6,540మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 3,61 5మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 3,242ఉత్తీర్ణత (89.68%) సా ధించారు. 3,906మంది బాలురలో 3,298 ఉత్తీర్ణత (84.43%) సాధించారు. అయితే గతేడాది రాష్ట్రంలో 76.15శాతం ఉత్తీర్ణత సాధించిన జోగుళాంబ గద్వాల జిల్లా ఈ ఏడాది ఫలితా ల్లో 89.68 ఉత్తీర్ణత సాధించింది. అం టే 10.81 అధిక శాతం ఉత్తీర్ణతతో మె రుగైన ఫలితాలు సాధించింది. అయితే జిల్లాలో 8 సర్కార్ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు అభినందించారు.

సత్తాచాటిన సర్కార్ పాఠశాలల విద్యార్థులు వీరే..
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ పాఠశాలల విద్యార్థులు తమ సత్తాను చాటారు. జిల్లా కేంద్రమైన గద్వాలలోని చింతలపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 294మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరు కా గా 247మంది విద్యార్థులు (84%) ఉ త్తీర్ణులయ్యారు. వీరిలో జిల్లాలోనే అ త్యుత్తమ జీపీఏ 9.8 నందిని సాధించ గా.. రేణుక, నవ్యశ్రీ, యశోద 9.5 జీపీ ఏ సాధించారు. వీరితో పాటు జీపీఏ 9 కు పైగా మొత్తంగా 15మంది విద్యార్థు లు సాధించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి విష్ణు తెలిపారు. అదే విధంగా గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో 269మంది వి ద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 226మంది విద్యార్థులు (83.64%) ఉత్తీర్ణులయ్యారు. అయితే వీరిలో నం దిని, రేణుక, సాలెహ 9.5 జీపీఏ సా ధించారు. మొత్తంగా 9 జీపీఏకు పైగా 17మంది సాధించినట్టు పాఠశాల జీహెచ్‌ఎం రవికుమార్ తెలిపారు. మోమిన్‌మహల్లా ఉన్నత పాఠశాలకు చెందిన (ఉర్దూ మీడియం) మెహబూబ 8.7 జీపీఏ సాధించింది. గద్వాల మండలం జమ్మిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శరత్ 9 జీపీఏ సాధించినట్టు హెచ్‌ఎం స్వర్ణలత తెలిపారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles