మీ బాగోగులు.. మా భుజాన వేసుకుంటాం

Sun,May 12, 2019 12:33 AM

-పవిత్రమైన ఓటును అసమర్థులకు వేయొద్దు
-కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు..
-ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం
-అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రచారం
అలంపూర్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ ఇది వరకు చేసిన అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించాలని, ప్రజల బాగోగులను తమ భుజాన వేసుకుంటామని అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే సుడిగాలి ఎన్నికల పర్యటన చేశారు. పనిచేసే సామర్థ్యం ఉ న్న అభ్యర్థులకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎమ్మల్యే ప్రజలను కోరారు. పవిత్రమైన ఓటు ను అసమర్థులకు వేసి వృధా చేయొద్దన్నారు. మండలంలోని క్యాతూరు, భీమవరం, బుక్కాపురం, సుల్తానాపురం, కాశాపురం గ్రామాల్లో అభ్యర్థులు శనివారం రోడ్ షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాతూరు ఎంపీటీసీ అభ్యర్థి అనురాధ, బు క్కాపురం ఎంపీటీసీ అభ్యర్థి రూపాదేవి, భీమవరం ఎంపీటీసీ అభ్యర్థి వెంకటలక్ష్మమ్మ, పార్టీ నాయకులు ఇ స్మాయిల్, నారాయణరెడ్డి, విక్రంసేనారెడ్డి, శేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మన్న, పల్లయ్య, అ య్యస్వామి, మద్దిలేటిరెడ్డి, నర్సన్‌గౌ డ్, వెంకట్రామయ్యశెట్టి, సింగవరం సర్పంచ్ రాంప్రసాద్ లు ఉన్నారు.

ఉండవెల్లి మండలంలో..
కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్లబొల్లి మాట లు నమ్మకుండా.. టీఆర్‌ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి, వేయిం చి జెడ్పీటీ సీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అ బ్రహం ప్రజలకు పిలుపునిచ్చా రు. మండలంలోని ఏ బూడిదపాడు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి రాములమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి సురేష్ లతో క లిసి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అబ్రహం శనివా రం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ నాయకులు బెల్లం లేకుండానే బచ్చాలు చేస్తారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థును గెలిపించుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ రాము డు, రమేష్, మణిరాజు, ఏసన్న, చిన్నభాస్కర్, శేఖర్, మురళి, వెంకటేష్, పాల్గొన్నారు.

భారీ మెజార్టీ సాధించాలి.. ఎమ్మెల్యే అబ్రహం
మానవపాడు : మండలంలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి సరిత విజయం ఖాయమైందని, భారీ మెజార్టీపైనే దృష్టి సారించాలని ఎమ్యెల్యే అబ్రహం అన్నారు. జెడ్పీటీసి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కొర్విపాడు, శ్రీనగర్, చంద్రశేఖర్ నగర్, మద్దూరు గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సరితతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ కారు స్పీడు ముందు ఏ పార్టీ నిలువలేదని అన్నారు. శనివారం ఉదయం జెడ్పీటీసీ అభ్యర్థి సరిత మానవపాడు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం కొనసాగించారు. గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి అలంపూర్ నియోజకవర్గానికి కేటాయించారని అది కూడా బీసి మహిళకు రిజర్వు అయిందని, జెడ్పీటీసీగా గెలిపిస్తే ప్రజల మధ్యలో ఉంటూ సేవచేస్తానన్నారు. కార్యక్రమంలో వెంకట్రాముడు, పల్లయ్య, దామోదర్‌రెడ్డి, వెంకట్రాముడు, మురళీధర్‌రెడ్డి, సుమలత ఉన్నారు.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles