టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందాం

Sun,May 12, 2019 12:32 AM

-ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వృద్ధులకు, దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్
-త్వరలోనే అలంపూర్ చౌరస్తాలో 100 పడకల దవాఖాన
-సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఆదరించండి
-ఇటిక్యాల మండలంలో మంద జగన్నాథం ప్రచారం
ఇటిక్యాల : ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందజగన్నాథం సూచించారు. మండలంలోని కొండేర్, జింకలపల్లె గ్రామాల్లో శనివారం టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని కూడళ్లలో ఓటర్లనుద్దేశించి మంద జగన్నాతం మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వృద్ధులకు, దివ్యాంగుల కు రెట్టింపు పెన్షన్ అందజేయడం జరుగుతుందన్నా రు. అలాగే నడిగడ్డలో ప్ర తిష్టాత్మకమైన బీచుపల్లి ఆ యిల్‌మిల్లును త్వరలోనే పునరుద్ధరించి 1500 నుంచి 2000 మందికి ప్ర త్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మిల్లు పుణరుద్ధరణతో నడిగడ్డలో వేరుశనగ పండించే రైతులకు ఎంతో మేలు చేకూరనుందన్నా రు. నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేందకు అలంపూర్ చౌరస్తాలో 100 పడకల దవాఖానను త్వరలోనే నిర్మిస్తామన్నారు. నడిగడ్డలో వలసలు ఆపేందుకే తుమ్మిల్ల, గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందుకే ఓటర్లు విజ్ఞతతో ఆ లోచించి ఎన్నో ఏండ్లుగా రాష్ర్టాన్ని పాలించి కేవలం సంపదను కూడబెట్టుకున్న పార్టీలను పక్కనబెట్టి సం క్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తెరాస పా ర్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి హనుమంత్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి సత్యమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచులు రవీందర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, నాయకులు రామిరెడ్డి, రాం దేవ్‌రెడ్డి, రవి, సత్యారెడ్డి, మద్దిలేటి, ఈరన్న, రవి, వెం కట్‌స్వామిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles