నెలాఖరుకల్లా ఎస్‌బీఎం లక్ష్యాలను పూర్తిచేయాలి

Sun,May 12, 2019 12:32 AM

-పారిశుద్ధ్యంలో మరుగుదొడ్ల నిర్మాణాలే కీలకమని లబ్ధిదారులకు తెలియచేయాలి
-అధికారులు శ్రద్ధ చూయిస్తే మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం
-మరుగుదొడ్ల ప్రోత్సాహకాలకు నిధుల కొరత లేదు: కలెక్టర్ శశాంక
గట్టు : ఈ నెలాఖరుకల్లా ఎస్‌బీఎం ల క్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. ఎస్‌బీఎం ప్రగతిపై స్థాని క గురుకుల పాఠశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రా మ పంచాయతీలవారీగా మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిని ఏపీవో, పంచాయ తీ కార్యదర్శులు, ఫీల్ట్ అసిస్టెంట్‌ల నుం చి రాబట్టారు. లక్ష్యాల్లో జాప్యానికి కారణాలను తెలుసుకున్నారు. సగానికి పైగా లక్ష్యాలను చేరుకున్న పంచాయతీ కార్యదర్శులు మస్తాన్, రమేశ్, శివన్న, రామక్రిష్ణ, కిరణ్‌కుమార్‌రెడ్డి లను కలెక్టర్ అ భినందించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల వేగవంతంపై దిశానిర్ధేశం చేశారు. ఎస్‌బీఎం మండల ల క్ష్యం ఇంకా 28.84శాతమే ఉండడం ఏ మిటని ప్రశ్నించారు. మరుగుదొడ్ల వేగవంతపై మండలస్థాయి అధికారులతో పాటు కిందిస్థాయి అధికారులు కూడా దృష్టి సారించాలన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాల్లో పంచాయతీ కార్యదర్శి, ఫీల్ట్ అసిస్టెంట్‌లే కీలకపాత్ర పోషించాలన్నారు. నిర్మాణాల ప్రగతిని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఇం దులో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం విధిగా మరుగుదొడ్డి నిర్మించుకునేలా అ వగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యంలో మరగుదొడ్ల నిర్మాణాలే కీలకమ నే విషయాన్ని లబ్ధిదారులకు తెలియచేయాలన్నారు. మొక్కుబడిగా కాకుండా బాధ్యతతో పనిచేస్తే మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాలను చేరుకోవడం కష్టమేమికాదనే అభిప్రాయాన్ని కలెక్టర్ వెలిబుచ్చారు. లబ్ధిదారుల వద్ద అధికారులు కొంత విచక్షణ చూయిస్తే మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని ఆ యన స్పష్టంచేశారు. మరుగుదొడ్ల ప్రో త్సాహాలకు నిధుల కొరత అసలు లేదని తేల్చిచెప్పారు. అంతకుముందు కలెక్టర్ తుమ్మలచెర్వు, రాయాపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మరుగుదొడ్ల ల బ్ధిదారులు, స్థానికులతో మాట్లాడి మరుగుదొడ్ల ఆవశ్యతను వివరించారు. తహసీల్దార్ కార్యాయలంలో అధికారులతో వివిధ శాఖల ప్రగతిని సమీక్షించారు. కార్యక్రమంలో డీపీవో కృష్ణ, డీపీఆర్ వో, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో, ఎస్‌ఐ, ఎంఈవో తదితరులున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles