ప్రభుత్వ దవాఖానాల్లో..

Sun,May 12, 2019 12:32 AM

-రోగులకు మెరుగైన సేవలందించాలి
-ప్రసూతి భవనం ప్రారంభోత్సవంలో కలెక్టర్ శశాంక
గట్టు : ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన సేవలు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లవుతుందని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. స్థానిక పీహెచ్‌సీలో ప్రసూతి భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసూతి భవనంతో పాటు పీహెచ్‌సీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానాలో ప్రసవాల సంఖ్యను ఇంకా పెంచాలన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మరో వైద్యాధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికనుగుణంగా మెరుగైన వైద్యాన్ని రోగులకు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దవాఖానలోని ఓ బాలింతకు కేసీఆర్ కిట్‌ను అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేంద్రకుమార్, మండల వైద్యాధికారి రాజసింహ, వైద్య సిబ్బంది ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles