జోగుళాంబ యాగశాలలో చండీహోమం

Sat,May 11, 2019 12:35 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : జోగుళాంబ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల తదితర పూజలు చేశారు. అమ్మకు ఇష్టమైన శుక్రవారం రోజున కుమారి సువాసిని పూజలు జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు గాజులు, రవికలు, నిమ్మకాయలు, కుంకుమ తదితర వస్తువులు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జోగుళాంబ ఆలయంలో భక్తులు కుంకుమార్చనలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలోని యాగశాలలో సామూహిక చండీహోమాలు చేశారు. హోమంలో 18 భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ వెంకటాచారి తెలిపారు. సాయంత్రం సంధ్యా సమయాన జోగుళాంబ ఆలయంలో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారి గర్భాలయం చుట్టూ రథోత్సవం కొనసాగించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం చండీహోమంతోపాటు సంధ్యావేళ రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles