పీటీజీ పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sat,May 11, 2019 12:35 AM

అమ్రాబాద్ రూరల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఆదివాసీ గిరిజన బాలుర గురుకుల (పీటీజీ) పాఠశాలలో వివిధ తరగతుల్లో సీట్లు ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ మొగిలయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆదివాసీ గిరిజన బాలుర విద్యార్థులకు మాత్రమే ఈ క్రింది విధంగా సీట్లు ఉన్నాయన్నారు. 3వ తరగతిలో 80 సీట్లు, 4వ తరగతిలో 31 సీట్లు, 5వ తరగతిలో 31 సీట్లు, 6వ తరగతిలో 14 సీట్లు, 7వ తరగతిలో 4 సీట్లు, 9వ తరగతిలో 15 సీట్లు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పై తరగతుల్లో చెంచు విద్యార్థులు మాత్రమే కులం, ఆదాయం, బోనోఫైడ్, ఆధార్‌కార్డు, రెండు పాస్ ఫొటోసైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను మన్ననూర్ పీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 31వ తేదీలోగా సాయంత్రం వరకు సమర్పించగలరని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశం పొందిన లిస్టును వచ్చే నెల 12వ తేదీనాటికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చెంచు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles