ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి

Sat,May 11, 2019 12:35 AM

మల్దకల్ : మండలంలోని తాటికుంట గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ కుమార్ (16) ట్రాక్టర్ ఢీ కొని మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు గ్రామానికి చెందిన తలారి లక్ష్మన్న కుమారుడికి రాజోలి మండలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన అమ్మాయితో పెండ్లి కుదిరింది. శుక్రవారం పెండ్లికిగాను మాన్‌దొడ్డి నుంచి తాటికుంట గ్రామానికి వచ్చారు. శుక్రవారం పెండ్లి తర్వాత తిరిగి మాన్‌దొడ్డికి ట్రాక్టర్‌లో వారు బయలు దేరారు. గ్రామానికి కిలో మీటర్ దూరంలో ఆదే గ్రామానికి చెందిన స్వామిదాస్ కుమారుడు వినయ్‌కుమార్ (16) తన ద్విచక్రవాహనాన్ని రోడ్డు కింద ఆపి బయలుకు వెళ్లి తిరిగి వాహనం దగ్గరికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ వినయ్ కుమార్‌ను ఢీ కొట్టడంతో వినయ్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్లో గల కొందరు మహిళలు కూడా గాయపడ్డారు.విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీపీ మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రిష్ణాబుల్‌రెడ్డి తెలిపారు. అలాగే ట్రాక్టర్ డ్రైవర్ కూడా మద్యం సేవించి ట్రాక్టర్ నడిపినట్లు తెలుస్త్తుందన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles