వరికొయ్యలకు నిప్పంటుకుని.. 42 గొర్రె పిల్లలు సజీవదహనం

Sat,May 11, 2019 12:34 AM

కోడేరు: వరి కొయ్యలకు నిప్పంటుకొని ప్రమాదవశాత్తు జల్ల గంపకింద ఉన్న గొర్రెపిల్లలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎర్రన్నబావితండా సమీపంలో గురువారం జరిగింది.హెడ్‌కానిస్టేబుల్ కృష్ణయ్య కథనం ప్రకారం విరాలిలా ఉన్నాయి. పాన్‌గల్ మండలం కేతెపల్లి గ్రామానికి చెందిన ఓరె పెద్దనాగయ్య అనే గొర్రెల కాపరి కొన్ని రోజుల కిందట కోడేరు మండలం ఎర్రన్నబావితండా సమీపంలో తమ గొర్రెలను మేత మేపటానికి తీసుకువచ్చాడు. ప్రతి రోజు లాగానే గురువారం ఉదయం తమ గొర్రెల మందను తండా సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మేత మేపటానికి తీసుకెళ్లారు. వరి కొయ్యలు ఉన్న ప్రదేశంలో మందను ఆపారు.మందలో 42 గొర్రె పిల్లలు ఉండగా వాటిని జల్లగంప కింద కప్పి మిగిలిన మందను మేత కోసం తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఎవరో గర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పంటించటంతో దాదాపు 15 ఎకరాలలో ఉన్న వరి కొయ్యలకు నిప్పంటుకొని ఆఖరికి జల్లగంపకు కూడా నిప్పంటుకుంది. దీంతో గంపకిందగల 42 గొర్రె పిల్లలు సజీవదహనమయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే హెడ్‌కానిస్టేబుల్ కృస్ణయ్య తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పంచానామా నిర్వహించారు. సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles