రాజోళిలో జంట హత్యల కలకలం

Thu,May 9, 2019 12:50 AM

-వివాహేతర సంబంధమే కారణం
-మృతులు కర్నూల్ జిల్లా వాసులు
-మహిళ కొడుకుపైనే అనుమానం?
రాజోళి: రాజోళిలో జంట హత్యలు కలకలం రేపాయి. రాజోళి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన మార్గంలో బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి, మరో మహిళను పట్ట ప గలే హత్య చేయడంతో రాజోళి, వడ్డేపల్లి గ్రామాల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ విషయం దావనంలా వ్యాపించింది. ఈ ఘటనా స్థలా న్ని డీఎస్పీ షాకీర్ హుస్సేన్ సందర్శించారు. సీఐ గురునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన తెలుగు బడేసాబ్(50)కు గుండ్రేవుల గ్రామానికి చెందిన శంకరమ్మ(42)తో గత కొంత కాలంగా పరిచయం ఉంది.

అదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వారివురు బుధవారం శాంతినగర్ నుంచి రాజోళి వైపునకు ఆటోలో వెళ్తుండగా, ద్విచక వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వారివురుని ఆటోలో నుంచి కిందకు దించి పదునైన ఆయుధంతో వారిని నరకడంతో తెలుగు బడేసాబ్, శంకరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

మహిళ కొడుకుపైనే అనుమానాలు
మృతి చెందిన మహిళ కొడుకు రాముడు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. హత్యకు గురైన తెలుగు బడేసాబ్ కుమారుడు గోపా ల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో రాముడు అనే వ్యక్తిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం కూడా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో సీఐతో పాటుగా రాజోళి ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి, శాంతినగర్ ఎస్‌ఐ మహేందర్ ఉన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles