కురుమూర్తిస్వామి హుండీ లెక్కింపు

Thu,May 9, 2019 12:48 AM

చిన్నచింతకుంట: మండలంలోని అమ్మపూర్ గ్రామసమీపంలోని సప్తగిరుల మధ్య కొలువుదీరిన కురుమూర్తి స్వామి దర్శనానికి పౌర్ణమి, అమవాస్యతోపాటు ఆయా దినాలలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని హుండీలో కానుకలను వేశారు. హుండీని ఆలయ కార్యనిర్వహాణాధికారి శ్రీనివాసరాజు, ఈవో ప్రేమ్‌కుమార్ సమక్షంలో బుధవారం లెక్కించగా రూ. 2,84,726 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితోపాటు అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, ఆలయ సిబ్బంది శివనందచారి, సాయిరెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పాలమూరు యూనివర్సిటీ: వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పీయూ ప్రిన్సిపల్ డాక్టర్ నూర్జాహాన్ విద్యార్థులకు సూచించారు. పాలమూరు విశ్వ విద్యాలయం పరిధిలోని ప్రాంగణ ఎంపికలకు ముఖ్య అతిథిగా పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నూర్జాహాన్ ముఖ్య అతితిగా హాజరై మాట్లాడారు. బుధవారం పాలమూరు విశ్వ విద్యాలయం కళాశాలలో జెస్ట్ ఫర్ డయల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles