మరుగుదొడ్ల నిర్మాణంలో రావులపల్లి భేష్

Thu,May 9, 2019 12:48 AM

భూత్పూర్: మండలంలోని రావులపల్లిలో మరుగుదొడ్ల నిర్మాణంలో రావులపల్లి గ్రామం ఎంతో ముందుందని స్వచ్ఛభారత్ బృందం సర్పంచ్ శ్రీనయ్యను అభినందించారు. బుధవారం యూనిసెఫ్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ రాష్ట్ర కో ఆర్డ్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు, వాటి నిర్వాహణకు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. మరుగుదొడ్ల నిర్మాణాలను చేపడితే గ్రామాల్లో పారిశుద్ధ్ద్యం, ప్రజల ఆరోగ్యం ఎంతో బాగుంటందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణగా ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల వల్ల అంటువ్యాధులు సైతం దూరమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో హేమచంద్రుడు, ఉపసర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.త్వరితగతిన భూసేకరణ చేయండివనపర్తి, నమస్తే తెలంగాణ: పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే గ్రామాలకు త్వరగతిన భూసేకరణ చేసి వారికి పునారావాస గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. బుధవారం తన చాంబర్‌లో పాలమూర్-రంగారెడ్డి వనపర్తి ఇరిగేషన్ అధికారులతో పునారవాస గ్రామాలలో కల్పించాల్సిన ఏర్పాట్లుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి యాక్ట్ ప్రకారం టెక్నికల్ పరంగా భూమి సర్వే చేయాలని.. భూమి కోల్పోయిన వారికి తప్పకుండా డబ్బులు చెల్లించాలని.. ఏవరైన రైతులు భూమి ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడితే ప్రభుత్వ విధివిధానాలను తెలియజేయాలన్నారు. అలాగే ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చి కాల్వలు, సైడ్‌డ్రైన్ లు సర్వేచేసి వెంటనే పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. బెనిఫిషర్స్ ఎక్కువగా ఉంటే లాటరి పద్ధ్దతిలో ఇచ్చే విధంగా చూడాలని, పునరావాస గ్రామాలకు రోడ్లు, సైడ్‌డ్రైన్స్, సీసీ రోడ్లు టెండర్స్ ద్వారా పిలిపించి అతి త్వరలో పనులు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో స్కూల్ బిల్డింగ్, అంగన్‌వాడీ సెంటర్స్‌ను నిర్మించాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటయ్య, ఇరిగేషన్ ఈఈ విజయ్‌భాస్కర్, డీఈలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles