పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి..

Thu,May 9, 2019 12:48 AM

ఇటిక్యాల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు గాను పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులకు ఆదేశించారు. మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా కొట్టం బీపార్మసీ కళాశాలలో నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అందకుగాను చేపట్టాల్సి ఏర్పాట్లను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంలను ఓట్లలెక్కింపు చేపట్టేగదులను పరి శీలించి చేపట్టాల్సిన చర్యలను అ ధికారులకు సూచించారు. ఏ మం డలానికి చెందిన బ్యాలెట్‌బాక్స్‌లను బద్రపరిచేస్ట్రాంగ్ రూముల చెంతనే ఆ మండలాల ఓట్లలెక్కిం పు గది పక్కపక్కన ఉండాలన్నా రు. ఒకేహాల్‌లోనే ఆ మండలానికి చెం దిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లలెక్కింపు ఉండాలన్నారు. అలాగే సీసీకెమెరాల ఏర్పాటు, రిసెప్షన్ సెంటర్‌ఏర్పాటు, స్ట్రాంగ్‌రూంల చెంత అగ్నిమాపక సిలిండర్లు ఏర్పాటు తదితరఅంశాలను అధికారులకు వివరించారు. ఓట్లలెక్కింపు సమయంలో పోలీసుల సహాయంతో ఎవ్వరినిలోనికి అనుమతించకుండా చర్యలు చేపట్టాలన్నారు. 15 నుంచే బారికేడ్లను ఏర్పాటు ప్రక్రియను ప్రా రంభించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పంచాయతీ కార్య దర్శులకు ఎస్‌మ్మెస్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలను పంపి స్తూ అప్రమత్తం చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు ఎక్కడ నిర్లక్ష్యం వహిం చ కుండా తగు ఏర్పాట్లను చేసి విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు డీపీవో కృష్ణ, డీపీఆర్‌వో సీతారాంనాయక్, ఓట్ల లెక్కింపు పర్యవే క్షణ అధికారి యాదయ్య, ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి తహసీల్దార్ రమేష్‌రెడ్డి, డీటీవేణుగోపాల్‌రెడ్డి వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles