సమ్మర్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఇన్‌చార్జి డీఈవో

Thu,May 9, 2019 12:48 AM

మల్దకల్ : మండల కేంద్రంలో వెంకటేశ్వ ర యూత్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న క్రీ డాకారుల సమ్మర్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇన్‌చార్జి డీఈవో సుశీందర్ రా వు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన పుట్‌బాల్, కబ డ్డీ క్రీడాకారులతో కొద్దిసేపు ఆటలు ఆడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం యూత్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషించ దగ్గ విషయమన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమ్మర్ క్యాంపు ఇన్‌చార్జి జితేందర్, ఆనంద్, పీఈటీలు లక్ష్మణ్, తిమ్మప్ప, తిరుమలేశ్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles