భూసార పరీక్షలు చేయించుకోండి

Thu,May 9, 2019 12:48 AM

ఇటిక్యాల : గ్రామంలోని ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ సూచించారు. మండలంలోని బట్లదిన్నె గ్రామంలో బుధవారం భూసార పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గ్రామంలోని ఏస్తేరమ్మ వ్యవ సాయ భూమిలో మటి ్టనమూనాలను సేకరించారు. అనంతరం గ్రామంలోని రైతుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ మండలంలో ఒక గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద భూసార పరీక్షలను నిర్వహించుటకు ఎంపిక చేయడం జరిగింద న్నారు. అందులో బాగంగా ఇటిక్యాల మండలంలో బట్లదిన్నె గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేయబడిన గ్రామంలో 177మంది రైతులకు సంబంధించిన 825 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ భూమిలో సాగు చేపట్టబోయే వర్షాధార ఆరుతడి పంటలకు గాను భూమిలో ఏయే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో తెలుసుకొని రైతులు పంటలను సాగు చేయుటకు గాను ఏయే ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలియ జేయడం జరుగుతుందన్నారు. రైతులు సహకరించి త్వరితగతిన భూసార పరీక్షలను పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఆయన రైతు సమగ్ర సమాచార సేకరణలో తమ పూర్తి సమాచారం అందించి రాబోవు కాలంలో ప్రభుత్వం రైతులకందించే లబ్ధిని పొందాలన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ వ్యవసాయ ఉపసంచాలకులు సక్రియానాయక్, మండల వ్యవసాయ అధికారి అయూబ్, ఏఈవోలు భరత్‌సింహా, సురేందర్ గ్రామం లోని రైతులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles