గోదల్‌లో రైతు ఆత్మహత్య

Thu,May 9, 2019 12:48 AM

బల్మూరు: కంపతుమ్మ చెట్టుకు ఉరేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం గోదల్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గోదల్ గ్రామాని చెందిన పఠాన్ హమీద్‌ఖాన్(49) ఇనాం భూమితో పాటు కౌల్‌కు వ్యవసాయ భూములను చేసుకుంటు, గ్రామంలో జీపీ ఆధ్వర్యంలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రబీ సీజన్‌లో వరి పంట వేశాడు. పంటపూర్తిగా ఎండిపోవడంతో ఈనెల 7న వరి కోత మిషన్ ద్వారా పంటను కోయించి కుప్పగా వేశాడు. పంటలకు తెచ్చిన అప్పులు ఎట్ల తీర్చాలని మనస్థాపంతో ఆవేదన చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఆరుమంది అమ్మాయిలు, వారిలో 5 మందికి పెళ్లిళ్లు చేశాడు. పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు, పంటలకు తెచ్చిన అప్పులు ఎక్కువగా కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బల్మూరు పోలీసులకు సమచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అతని భార్య రమీజాబీబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ దవాఖా నకు తరలించినట్లు ఏఎస్‌ఐ జిలాని తెలిపారు. కుటుంబీకుల రోదనలతో ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles