క్షణికావేశానికి ముగ్గురి బలి

Thu,May 9, 2019 12:47 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: కోపోద్రిక్తులై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నలు, ఓ చెల్లెలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అమరచింత మండలం నందిమల్ల క్రాస్‌రోడ్ (కిష్టంపల్లి)లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం మేరకు.. చిన్నపాగు రంగన్న దంపతులకు ఇద్ద రు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలో ఓ కూతురు గతంలోనే మృతిచెందగా, పెద్ద కుమార్తెకు, పెద్ద కుమారుడు సంజీవ్‌కు వివాహాలు చేశారు. రమేష్ (20), జ్యోతి (16)లకు వివాహం చేయాల్సి ఉండగా రమేష్ తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరాడు. ఈ విషయాన్ని చర్చించేందుకు హైదరాబాద్‌లో కూలీపని చేస్తూ జీవిస్తున్న పెద్దన్న సంజీవ్ సహితం స్వగ్రామానికి చేరుకొని గ్రామంలో చర్చలు చేశారు. ప్రేమ వివాహం చేసేందుకు అడ్డంకులు మొదలయ్యాయి. ఇంట్లో ఎవరి మాట ఎవరూ వినని పరిస్థితి ఏర్పడడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో చెల్లెలు జ్యోతి తన సెల్‌ఫోన్ తీసుకొని మాట్లాడటాన్ని సహించని అన్న ర మేష్ చెల్లెల్ని గట్టిగా మందలించాడు. పెద్దన్న సంజీవ్ సహితం చెలెల్ని మందలించడంతో ముగ్గురి మధ్య పెనుగులాట జరగడంతో తల్లిదండ్రులు వారిని వారించారు. ఓదశలో ఇంట్లోనే కిరోసిన్ పోసుకొనేందుకు జ్యోతి, రమేష్‌లు ఉపక్రమించగా వదిన సుజాత, తల్లిదండ్రులు అడ్డుకొని జ్యోతిని బయటికి పంపించారు. ఇద్దరు అన్నదమ్ముల్ని సముదాయిస్తుండగా బయటికి వెళ్లిన చెల్లెలు జ్యోతి ఇంటికి సమీపంలోని పురాతన వ్యవసాయ బావిలో దూకింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు అన్నలు రమేష్, సంజీవలు సహితం చెల్లెల్ని కాపాడేందుకు దూకి ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. సెల్‌ఫోన్ చిచ్చు.. ప్రేమ వ్యవహారం.. కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు తమ ప్రాణాలను కోల్పోయారు. మృతదేహాలను ఆత్మకూరు సర్కారు దవఖానాకు తీసుకొచ్చిన క్ర మంలో డీఎస్పీ సృజన మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులతో పూర్వపరాలు తెలుసుకున్నారు. పెద్ద కుమారుడు సంజీవ్‌కు భార్య సుజాత, కూతురు మేఘన (7), కుమారుడు నితిన్‌కుమార్(3) ఉన్నారు. ఒకే కుటుంబంలో ము గ్గురు చనిపోవడంతో నందిమల్ల క్రాస్‌రోడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు శంకర్ తెలిపారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles