ప్రతి పల్లెల్లో గులాబీ జెండా ఎగరాలి

Wed,May 8, 2019 01:59 AM

-పార్టీలు మారే వారి మాటలు నమ్మొద్దు
-అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
-బీజేపీ ఒక ఎమ్మెల్యే సీటుతో ఏమి సాధిస్తుంది..
-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-మల్దకల్‌మండలంలో ముమ్మర ప్రచారం
మల్దకల్: గద్వాల నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఈ సారి గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని పావనంపల్లి, పెద్దపల్లి, పాల్వాయి, ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం, చిప్పదొడ్డి, నాగర్‌దొడ్డి, కుర్తిరావుల చెర్వు, తాటికుంట, శేషంపల్లి, పెద్దొడ్డి, గార్లపాడు, నీలిపల్లి, ఎద్దులగూడెం, మద్దెలబండ, పెద్దతాండ, చిన్న తండా,మల్దకల్ గ్రామాలలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల తరుపున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే అధికారంలో ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ఉందని సర్పంచులు కూడా టీఆర్‌ఎస్ పార్టీ వారే ఉన్నారని అలాంటప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇతర పార్టీలు వారు ఉంటే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయా అని ప్రజలను ప్రశ్నించారు.

గ్రామాల్లోని ప్రజలు కూడా గుర్తించుకోని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తాదో వారికే పట్టం కట్టండన్నారు. అంతేకాని పార్టీలు మారుతూ వారి ఉనికి కో సం గ్రామాల్లో పర్యటిస్తున్న వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. అధికారంలో లేకున్న సరే గతంలో మంత్రుల సహాయ సహకారాలతో నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి పాడుబడిన విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో జెడ్పీటీసీ అ భ్యర్థి వై.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు వైస్ ఎంపీపీ రాజారెడ్డి, యశోదమ్మ, సత్యారెడ్డి, సరోజమ్మ, రాజు, వీరన్న, కుర్వ చిన్న శివన్న, పార్వతమ్మ, తిమ్మరాజులతోపాటు మండల పార్టీ అ ధ్యక్షుడు నర్సింహులు, సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, నా యకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, ప్రహ్లాదరావు, ఎంపీటీసీ వెంకట న్న, మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, మాణిక్య రెడ్డి, తిమ్మారెడ్డి, నరేందర్, బాబురావు, నారయణ, మధు, రమేష్ రెడ్డి, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles