పైసలిస్తేనే పనిచేస్తారా!

Wed,May 8, 2019 01:58 AM

కోయిల్‌కొండ : వారసత్వ భూములను విరాసత్ చేయాలని కొన్నేళ్లుగా త హసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరిస్తలేరని.. పెద్దలు పోయారు.. మేము కూడా పోతేగాని విరాసత్ అయ్యే పరిస్థితి లేదని.. భూమి పట్టా అయినా పాసు పుస్తకం రావడం లేదని ధర్మగంట ద్వారానైనా సమస్య పరిష్కరిస్తారని బాధిత రైతులు వేడుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెంది న రాజు సర్వే నంబర్ 72/39/ఆలో 36 గుంటల భూమి కొన్నేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయినా పాసు పుస్తకం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని దమాయపల్లి గ్రామానికి చెందిన వరద హన్మంతు తండ్రి నర్సప్ప నాలుగేళ్ల క్రితం మరణించగా నర్సప్ప పేరు మీద ఉన్న భూమి సర్వే నంబర్ 172 విరాసత్ కోసం నాలుగేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా విరాసత్ చేయడం లేదని వెల్లడించారు. మండలంలోని గార్లపాడ్‌లోని సర్వే నంబర్ 13/ఈ, 270, 253, 254, 247లో 2.20 ఎకరాల వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని గొల్ల హన్మంతు, గత్ప వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి రై తులు ఆరోపిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని కాస్తు చేస్తున్నామని, తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ నమోదు చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. దీంతో పాటు పెట్టుబడి సాయం అందలేదని, పాసుపుస్తకాలు రా ని రైతులు నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేద ని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles