ఐఏఎస్, ఐపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

Wed,May 8, 2019 01:58 AM

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఆత్యున్నతమైన కలెక్టర్, ఎస్పీ ఇతర కేంద్ర సర్వీసులలో చేరాలనుకునే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ చ్చేందుకుగాను ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ పి.యాదయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆయన తన కార్యాలయంలో మంగళవారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పాత పది జిల్లా కేంద్రాల్లో CSAT-2020 పరీక్ష డైరెక్టర్, టి.ఎస్.స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారిచే ప్రభుత్వం ప్రవేశ పరీక్షకు డీగ్రీ ఆభ్యర్థులకు ఈ నెల 31 వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాసు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 9వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలో ఉతీర్ణత సాధించిన ఆభ్యర్థులకు సుమారు 11 నెలల పాటు ఉచిత భోజన వసతితో పాటు నిష్ణాతులైన ఆధ్యాపకులచే శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణా కాలంలో ఆభ్యర్థులకు రూ.10వేల విలువ కలిగిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేయనున్నట్లు వారు తెలిపారు.

ఈ శిక్షణా కాలంలో ఆభ్యర్థులకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం మహిళలకు ప్రతి నెల రూ.1,000, పురుషులకు రూ.750, దీనితో పాటు ప్రతి నెల రూ. 3వేలు చొప్పున అలవెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సంస్థలో శిక్షణ పొందిన ఆభ్యర్థులు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతమైన పదువుల్లో ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. మరిన్ని వివరాల కోసం www.tsscstudycircle.telgana.gov.in పొందుపర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్యాలయ అధికారులు, రాజు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles