నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి

Wed,May 8, 2019 01:58 AM

ఉండవెల్లి : 23న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే ఓట్లు లెక్కింపునకు వచ్చే సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిరంజన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తామార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు విధులకు హాజరవుతున్న సిబ్బందికి ఆర్డీవో రాములు ఆధ్వర్యంలో మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిరంజన్ మాట్లాడుతూ.. అలంపూర్ నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించుకున్నామని, అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికలపై లెక్కింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయా లన్నారు. 23న నాగర్‌కర్నూల్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు అప్రమత్తంగా వ్యవ హరించి, ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలంపూర్ నియో జకవర్గ పరిధిలో 280 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్స్‌లను, 14టేబుల్స్ ఏర్పాటుతో 21రౌండ్‌ల్లో ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓట్లలెక్కింపు ప్రక్రియ సిబ్బంది నిబంధనలకు లోబడి పనిచేయాలని, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈవీఎంలు ఓట్ల లెక్కింపులో ఎదైనా లోపం ఉంటే ఈసీఐసీ టెక్నికల్ ఇంజినీయర్లు అం దుబాటులో ఉంటా రని, వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఓట్లలెక్కింపు కేంద్రంలో గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది ఎజెంట్‌గా వచ్చే వ్యవక్తులు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆటు, ఇటు తిరగకుండా చూడాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓడిపో య్యె అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రంలో గందరగోళ వాతవారణం, ఘర్షణలకు దిగే అవ కాశం ఉందన్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఈ నెల 16, 22న నాగర్‌కర్నూల్‌లో కూడా శిక్షణ ఉంటుందని వారికోసం అలంపూర్ చౌరస్తా నుంచి బస్సు, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా శిక్షణకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, తహసీల్దార్ల్ లక్ష్మి, నరేందర్, తిరుపతయ్య, రమేష్‌రెడ్డి సేక్టోరియల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles