సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల్లో పచ్చదనం

Wed,May 8, 2019 01:58 AM

రాజోళి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెలు పచ్చదనం సంతరించుకుని, ప్రశాంతతకు మారు పేరుగా మారాయని అలంపూర్‌ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మంగళవారం మండలంలోని మాన్‌దొడ్డి, నసనూర్, చిన్నధన్వాడ, పెద్ద ధన్వాడ, గ్రామాల్లో ఆయన వైస్ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రయచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులకు పెద్ద పీట వేసి, వ్యవసాయాన్ని పండుగ చేశారని, చిన్న రైతులు సైతం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్నీరంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుందని, గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజోళి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్న సుగుణమ్మను, మాన్‌దొడ్డి ఎంపీటీసీ అభ్యర్థి సోమ య్యను, పెద్ద ధన్వాడ ఎంపీటీసీ అభ్యర్థి మరియమ్మ ను భారీ మెజార్టీలతో గెలిలపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles