అధికారులు సన్నధం కావాలి

Wed,May 8, 2019 01:58 AM

గద్వాల, నమస్తేతెలంగాణ: స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి విడత ప్రశాంతగా ముగిశాయని రెండవ విడత ఎన్నికలను సైతం సజావుగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, పోలీస్ యంత్రాంగం సన్న ద్ధం కావాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో రెండో విడతకు సంబంధించిన రిటర్నింగ్, అధికారులు, సహాయరిటర్నింగ్ అధికారులు ఎస్‌హెచ్‌వోలు, తహసీల్దార్‌లతో ఎన్నికల సన్నద్ధతపై ఎస్పీలక్ష్మీనాయక్‌తో క లిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వి వరాలను సేకరించామని చెప్పారు. బ్యా లెట్ బాక్స్‌ల విషయంలో 400-నుం చి 600మధ్య ఓట్లు ఉన్న పోలింగ్ స్టేషన్లకు పెద్ద బ్యాలెట్ బాక్స్‌తో పాటు ఒక మీడియం లేదా చిన్న బ్యాలెట్ బాక్స్ ను అదనంగా కేటాయించాలన్నారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ల విషయం లో అత్యంత జాగ్రత్తగా ఫ్రూఫ్ రీడింగ్ చేసుకోవాలన్నారు. గుర్తులు క్రమపద్ధతిలోనే సరిగ్గానే ఉన్నాయాలేదా బ్యాలెట్ క్రమ సంఖ్య సరిగ్గానే ఉందా లేదా అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లువేయించడం, మం చినీరు కనీససౌకర్యాలు కల్పించాలని ఆ దేశించారు. ఎన్నికల సిబ్బందికి మంచి భోజన వసతి, మంచినీరు అందించడానికి ఒక మండలస్థాయి అధికారిని ని యమించుకోవాలని ఈ విషయంలో రాజి పడొద్దని సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గం టల వరకు స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్ బా క్స్‌లు భద్రపరిచి సీలు వేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భ ంగా కొన్ని సమస్యలు వస్తుంటాయని అయితే అధికారులు తక్షణమే పోలీస్ యం త్రాంగానికి సమాచారం ఇవ్వాలన్నారు. సకాలంలో సమాచారం ఇస్తే పె ద్ద సమస్యలను సైతం సమస్య లే కు ండానివారించొచ్చని అధికారులకు తెలియజేశారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు గస్తీ తిరుగుతూ ఉంటారన్నారు. ముంద స్తు సమాచారంతో సమస్యలు తలెత్తకుం డా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించు కోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles